pizza
Arjun Reddy Theatrical Rights in Telugu States
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన `అర్జున్ రెడ్డి` థియేట్రిక‌ల్ హ‌క్కులు
You are at idlebrain.com > news today >
Follow Us

25 July 2017
Hyderabad

It is official that Asian Films, one of the leading distributors in Nizam area, and KFC entertainments together have acquired the theatrical distribution rights of 'Arjun Reddy' in both Telugu states.

'Arjun Reddy' had gained a lot of attention from youth with its uber popular teaser and its unique name and also the unique character content is doing a phenomenal pre-release business. Sunil Narang of Asian Films, who earlier distributed 'Baahubali 2' has acquired the A.P and Telangana movie rights for a handsome price. This is one of the most anticipated movies in both domestic and overseas market.

Vijay deverakonda as Arjun Reddy plays a short-tempered, arrogant medical student and Shalini as Preeti Shetty plays the female lead with a strong character. Vijay and Shalini come from a very strong theatre background and it is said that it will be an emotional feast to watch the performances on screen.

The talented Radhan has composed the music and the movie is surely turning up the heat with a slew of chartbusters in the music market. Keep watching this space for more updates.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన `అర్జున్ రెడ్డి` థియేట్రిక‌ల్ హ‌క్కులు...ఆగ‌స్ట్ చివ‌రి వారంలో గ్రాండ్ రిలీజ్‌

పెళ్ళిచూపులు చిత్రం సన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `అర్జున్ రెడ్డి`. షాలిని హీరోయిన్‌గా న‌టిస్తుంది. భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచుతుంది. విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌స్ట్ చివ‌రి వారంలో విడుద‌ల చేస్తున్నాయి. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై వ‌చ్చిన అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్‌కు క్రేజ్ ఏర్ప‌డింది. విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 చిత్రాన్ని విడుద‌ల చేసిన ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వ‌ర‌లో మార్క‌ట్లోకి విడుద‌ల కానుంది.

విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజ‌కృష్ణ‌న్‌, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్‌.ఎక్స్ః హ‌రికృష్ణ‌, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కృష్ణ వ‌డ్డేప‌ల్లి, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, కెమెరాః రాజ్ తోట‌, ఎడిటింగ్ః శ‌శాంక్‌, నిర్మాతః ప్ర‌ణ‌య్ వంగా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః సందీప్‌రెడ్డి వంగా.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved