pizza
Avasaraniko Abaddam Poster
You are at idlebrain.com > news today >
Follow Us

22 October 2015
Hyderabad

 

విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌తో 'అవ‌స‌రానికో అబ‌ద్ధం'

చ‌క్రం క్రియోష‌న్స్ మ‌రియు శ్రేయాస్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రై లిమిటెడ్ సంయుక్తంగా రూపోందిస్తున్న చిత్రం 'అవ‌స‌రానికో అబ‌ద్ధం'. సురేష్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ త‌న స్నేహితులు విజ‌య్‌.జె తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌తిమ‌నిషి అవ‌స‌రానికి ఖ‌చ్చితంగా అభ‌ద్దం ఆడితీర‌తారు అయితే అలా ఆడిన అభ‌ద్దం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అనే కాన్సెప్ట్ తో ఉత్కంఠ‌గా తెరకెక్కించారు. ఈచిత్రానికి సంభందించిన మెద‌టి లుక్ ని విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు..

ఈ సందర్భంగా నిర్మాత ద‌ర్శ‌కుడు సురేష్‌.కె.వి మాట్లాడుతూ.. ప్ర‌మోష‌న్ రంగంలో, నిర్మాణ రంగంలో ట్రెండ్ క్రియోట్ చేసిన శ్రేయాస్‌మీడియా వారి అనుభందంతో మా 'అవ‌స‌రానికో అబ‌ద్ధం' చిత్రాన్ని న‌ర్మించ‌టం చాలా ఆనందంగా వుంది. ప్ర‌తి మ‌నిషి జీవితం లో ఎక్క‌డో అక్క‌డ అవ‌స‌రానికి అభ‌ద్దం ఆడి వుంటాడు. అదే మా చిత్రానికి టైటిల్ గా పెట్టుకున్నాం. అలానే చిత్రం కూడా అదే మెయిన్ కాన్స్‌ప్ట్ గా క‌థ‌నం ర‌చించాము. అయితే అలా ఆడిన అభ‌ద్దం మ‌నుషుల జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాలు సృషించిందో దాని నుంచి వారు ఎలా బ‌య‌ట‌కు వస్తారో వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఈచిత్రాన్ని నిర్మించాము. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా మా చిత్రం మెద‌టి లుక్ ని విడుద‌ల చేశాము. మా పోస్ట‌ర్ ఎలా అంద‌రిని ఆక‌ట్టుకుంటుందో చిత్రం కూడా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకోవ‌ట‌మే కాక ఆద్యంతం ఉత్కంఠ‌కి గురిచేస్తుంది. త్వ‌ర‌లో ఆడియో టీజ‌ర్ ని విడుదల చేస్తాము.. అన్నారు

బ్యాన‌ర్‌.. చ‌క్రం క్రియోష‌న్స్‌, క‌థ‌, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- సురేష్‌.కె.వి, నిర్మాత‌లు- విజ‌య్‌.జె, సురేష్‌.కె.వి మ‌రియు స్నేహితులు, కెమెరా- వెంక‌ట‌ర‌మ‌ణ‌.ఎస్‌, ఎడిటింగ్‌- కార్తిక్ శ్రీనివాస్‌, సంగీతం- శేఖ‌ర్ చంద్ర‌, ప్రోడ‌క్ష‌న్ డిజైన్‌- కిరణ్‌.ఎన్‌, ఆర్ట్‌- పులి శ్రీకాంత్‌,


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved