pizza
'అవతలి వైపు' తల్లిదండ్రుల భావోద్వేగం
You are at idlebrain.com > news today >
Follow Us

19 December 2014
Hyderabad

విదేశాల్లో ఉంటున్న తమ పిల్లల ఆదరణకు నోచుకోక స్వదేశంలో తపించిపోతున్న తల్లిదండ్రుల సంఘర్షణ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న చిత్రం 'అవతలి వైపు'. డైరెక్టర్ వేణుగోపాల్ నక్షత్రం తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అవంతిక నక్షత్రం నిర్మిస్తున్నారు. నక్షత్రం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా తల్లిదండ్రుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలను చూపించబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్ టీజర్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు వేణుగోపాల్ నక్షత్రం చిత్ర విశేషాలను తెలిపారు. ఉన్నత చదువులు చదివి, విదేశాల బాట పట్టిన వారిలో అత్యధికులు అక్కడే వుండిపోతున్నారు. ఈ నేపథ్యంలో వృద్దులైన వారి తల్లి దండ్రులు ఇక్కడ ఎలాంటి ఉద్వేగాలకి లోనవుతున్నారు..? మానవ సంబంధాల్లో ఎలాంటి మార్పు వచ్చింది..? ఎప్పటికీ తిరిగి రాని తమ పిల్లల కోసం తల్లిదండ్రులు కుమిలి పోవాల్సిందేనా..? వాళ్ళ ముందున్న మార్గం ఏమిటి..? ఇలా ఎన్నో ఆలోచనలను రేకిత్తించే ప్రయత్నమే ఈ 'అవతలి వైపు' సినిమా అని చెప్పారు. తన తొలి చిత్రం 'ఎంతెంత దూరం' అందించిన విజయోత్సాహంతో మలిచిత్రంగా ఈ 'అవతలివైపు' సిద్ధమవుతోందని డైరెక్టర్ తెలిపారు.

సీనియర్ నటులు కాకరాల, కొమరం భీమ్ ఫేం భూపాల్ రెడ్డి.. తదితరులు నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ జరుపుకుంటోంది. త్వరలోనే 'అవతలి వైపు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేణుగోపాల్ నక్షత్రం, ఔరుగౌరు భైరాగి, నలిమెల భాస్కర్ కథ అందించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎడిటింగ్: వంశీ, కెమెరా: రాహుల్ మాచినేని, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వేణుగోపాల్ నక్షత్రం.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved