pizza
Baahubali Music: Joining the Dots by Chakri B
You are at idlebrain.com > news today >
Follow Us

2 July 2015
Hyderabad

SS రాజమౌళి .. సక్సెస్ ని ఇంటి పేరు గా మలుచుకున్న దర్శక ధీరుడు ... ప్రేక్షకులను అంచనాలకు మించి అబ్బురపర్చడం ఆయనకి అలవోక .. విజయాన్ని మించిన విజయం అందిచడం ఆతనికి మహా తేలిక ... అదిగో అందుకే "బాహుబలి " అనే ఆ మహాద్భుత దృశ్య కావ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ... రెండు భాగాలుగా వచ్చే బాహుబలి మొదటి భాగం జూలై 10న విడుదల కాబోతోంది .. కీరవాణి గారు స్వరపరిచిన పాటలు .. ఒక్కక్కటిగా తెలుస్తున్న విశేషాలని విశ్లేషించుకుంటూ మీ కోసం ఈ "BAAHUBALI MUSIC : JOINING THE DOTS"

"శివుని ఆన అయ్యిందేమో గంగ దరికి లింగమే కదిలోస్తానంది" ..
ఈ సినిమా ప్రచారం లో బాగంగా ప్రభాస్ ని శివుడి పాత్ర లో చూపించిన మొదటి పోస్టర్ కి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ... హీరో పరిచయ సన్నివేశాల్లో భాగంగా మన కండల వీరుడు.. అలా శివలింగం మోసుకోస్తుంటే వెంట్రుకలు నిక్క పోడుచుకునేలా హీరోయిసం స్క్రీన్ మీద శివతాండవం చేస్తుంది .. ఇనగంటి సుందర్ రచించిన ఈ స్తోత్ర గేయాన్ని అంతే భావోద్వేగంతో స్వయానా కీరవాణి గారు ఆలపించారు

ధీవర ..
"ధీర ధీర ధీర .. మనసాగ లేదురా ..." ఇక మరిచిపొండి ఆ పాటని (సరదాకి ...).. ఎందుకంటే ఇప్పుడు ధీ"వ"ర ఒచ్చాడు .. పదే పదే ... పదే పదే వినాలనిపించే పాట .. తెర మీద ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అనిపించే పాట .. మన ఆజానుబాహుడు "శివుడి" కోసం సాక్షాత్తూ అమరలోకం నుండి అవంతిక దిగి వస్తుంది ..అందని లోకపు చంద్రికై ఆహ్వానిస్తుంది .. రామజోగయ్య శాస్త్రి గారు యుగళాన్ని రాస్తే .. "ధీవర ప్రసర సౌర్యధార.. ఉత్సర స్ధిర గంభీర .. ఉగ్రవ అసమ సౌర్య ధామ .." ఇలా అనేక పర్యాయ పద విజ్రంబనతో శివశక్తి దత్తా గారు ఆకట్టుకున్నారు .. ఇంతకీ "వీరాట్వీర" అంటే అర్జునుడేగా !! రమ్య బెహార .. దీపు ఆలపించారు ఈ పాటని.. ఇది మొదటి యుగళ గీతం కావొచ్చు ..

పచ్చ బొట్టేసినా పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా ...
అవంతిక శివుడి మధ్య ప్రేమ చిగురించే సమయంలో ఒచ్చే పాట .. ఇక్కడ పచ్చబొట్టుకి ఏంటో ప్రాధాన్యత ఉందట .. అంటే బహుసా ఆ "పచ్చబొట్టు" ద్వారానే శివుడిని కారణ జన్ముడి గా గుర్తించి దేవకన్య వరించిందేమో !! అనంత శ్రీరాం ఎంతో రమణీయం గా రాసిన ఈ యుగళ గీతాన్ని కార్తిక్ , దామిని అంతే రమ్యంగా ఆలపించారు .. ... నాకు కొంచెం గా పంచదార బొమ్మ గుర్తొస్తుంది సన్నివేశ పరంగా .. అంటే అంత బాగుంటుంది అన్న మాట ..

మమతల తల్లి .. ఒడి బాహుబలి ...
శివుడి సాహసాలతో .. ఆట పాటలతో సరదాగా సాగిపోయే కథలో శివుడి తండ్రి "బాహుబలి" గురించి తెలుసుకునే సమయం ఒచ్చింది ..అలాగే ఆ "బాహుబలుని" తల్లి "శివగామి" . ఈ కధని .. అలాగే దర్శకుడు రాజమౌళికి ఎంతో స్ఫూర్తి నిచ్చి ముందుకు నడిపించిన అద్భుతమయిన పాత్ర శివగామిది ..ఆ పాత్ర తీరుని తెలపడానికి "యదలో ఒక పాల్కడలి .. మధనం జరిగే స్థలి " సాగర మధనం జరిగినపుడు విషం అమృతం పుడతాయి .. అలాగే ఆమె హృదయం లో నిరంతరం మధనం జరుగుతూనే ఉంది .. మరో సారి శాసన సమం శివగామి వచనం .. సదా రణరంగం నిరతం జనని హృదయం .. అంటే ఆమెలో అనునిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది .. ఇదే పాటలో బాహుబలి పాత్ర కూడా పరిచయం జరుగుతుంది .. మాహిష్మతి వర చాత్ర కులి చిత శాత్రవ బాహుబలి .. సాహస విక్రమ ధీశాలి అంటూ "భళ్ళా" తోనే సావాసం అంటూ మన "భల్లాలదేవ" రానా పరిచయం కూడా జరుగుతుంది .. శివ శక్తి దత్తా అతి శక్తివంతంగా రాసిన ఈ పాటను సూర్య యామిని కళ్ళకు కట్టినట్లు పాడారు .. ఈ పాట సినిమాలో కొంచెం కొంచెం గా రావొచ్చు ...

నిప్పులే శ్వాసగా .. గుండెలో ఆశగా ..
ఇప్పుడు బాహుబలి భార్య దేవసేన (అనుష్క) వంతు .. ఎన్నో ఏళ్ళుగా కారాగారం లో ఉన్న ఆమె చూపుకి " రాజ్యమా ఉలికి పడు " అని హెచ్చరిక జారీ చేస్తుంది ఈ పాట .. అనుష్క ఈ భాగం లో కొంచెం సేపే కనిపిస్తుంది .. రెండవ ఆ బాగం లో బాహుబలి దేవసేనల ప్రేమ కథ .. ఆమె ఈ స్తితిలో ఉండే కారణాలు తెలుస్తాయి !!

మనొహరి...
ఇక బాహుబలి లో ఐటెం పాట వంతు ..నోరా ఫతేహి నృత్యం చేసిన ఈ పాటని రేవంత్ చాల బా పాడాడు .. ఈ పాట సినిమా మొదట్లోనే రావొచ్చు "ఛత్రపతి" లో లా ...

దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ ... రోజుకి వెయ్యిమంది శ్రమదానం చెయ్యగా నిర్మించిన భారీ కట్టడాలు .. 600 మంది సాంకేతిక నిపుణులు .. "మకుటా"యమానంగా దేశ విదేశాల్లో పూర్తి చేసిన VFX ..

2 గంటల 38 నిమిషాలు నిడివి ఉంది కాబట్టి .. అలా మనని మనం మరిచిపోయి మాహిష్మతి రాజ్యం లో విహరించేందుకు ఎంతో ఉత్సుకగా ఉండే ఉంటుంది నాలా అందరికి ..

తెలుగు వారు గర్వంగా యావత్ సినీ ప్రపంచానికి అందించే ఈ మహత్తర కానుక ఎన్నో అంచనాలని అందుకుని విజయ కేతానాన్ని ఎగుర వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..

Chakri B


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved