శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు నిర్మాతగా రూపొందిన చిత్రం `మా అబ్బాయి`. ఈ సినిమా మార్చి 17న విడులవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాత బలగ ప్రకాష్ రావు మాట్లాడుతూ `` సినిమాలతో ఏదో లాభాలను సంపాదించేయాలనే ఆలోచనలతో ఇక్కడికి రాలేదు. నాకు సినిమాలంటే ఆసక్తి, పది మందికి ఉపాధి చూపించవచ్చుననే ఆసక్తితో సినిమా చేశాను. భవిష్యత్‌లో మా బ్యానర్ నుండి మంచి సినిమాలు చేయాలనే ఆసక్తిగా ఉన్నాను. అవకాశం వస్తే త్రివిక్రమ్‌గారి దర్శకత్వంలో సినిమా చేయాలనేదే ఆశయం. ఆయన చేసే ప్రతి సినిమాను నేను చూస్తుంటాను. మా నాన్నగారు రైతు. తర్వాత జీడిపప్పు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాను. నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా `మా అబ్బాయి`. దర్శకుడు కుమార్ వట్టి చెప్పిన కథ బాగా నచ్చింది. కథలో లవ్, యాక్షన్, కామెడి, ఎమోషన్స్ అన్నీ ఎలిమెంట్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది. అన్నీ వర్గాలకు నచ్చే సినిమా అవుతుందని గట్టినమ్మకంతో ఉన్నాం. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయితే సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా చేశాను.