pizza
Nandamuri Balakrishna Condolences to Parabrahma Sastry
పరబ్రహ్మశాస్త్రి మరణం తెలుగు వారికి తీరని లోటు!
You are at idlebrain.com > news today >
Follow Us

28 July 2016
Hyderaba
d

మరుగునపడిపోయిన తెలుగు చరిత్ర వెలుగులోకి తెచ్చిన మహనీయులు పరబ్రహ్మశాస్త్రి పోషించిన పాత్ర బహు కీలకమైనది. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడం మొదలుకొని శాతవాహనులు తెలుగువారే అని నిరూపించిన ఘటికులు పరబ్రహ్మశాస్త్రి. విద్యార్ధులకు చరిత్ర పరిశోధనలో సరికొత్త బాట చూపిన ఆయన బుధవారం (జూలై 27)న తుదిశ్వాస విడిచారు.

ఈ సందర్భంగా శాతవాహనుల చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి మరణనానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన 100వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం కోసం శాతవాహనుల్లో అయిదవ రాజైన శాతకర్ణి గురించి తమకు తెలియని చాలా విషయాలను పరబ్రహ్మశాస్త్రి గారు నిర్వహించిన పరిశోధన మరియు ఆయన రాసిన సంపుటాల నుంచే తెలుసుకొన్నామని. అటువంటి మహోన్నత వ్యక్తి నేడు మన మధ్య లేరు అనే విషయం నన్ను చాలా బాధిస్తోంది. తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా తెలుగు చరిత్రను దశదిసలా వ్యాపింపజేసిన పరబ్రహ్మశాస్త్రి కుటుంబానికి అండగా నిలుస్తానని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా "గౌతమిపుత్ర శాతకర్ణి" దర్శకులు క్రిష్ మరియు యూనిట్ సభ్యులందరూ పరబ్రహ్మశాస్త్రి మరణానికి చింతిస్తూ నివాళులర్పించారు!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved