pizza
Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios and Annapurna Studios Pvt Ltd begins the shoot of the much awaited movie Bangaraju.
అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ బంగార్రాజు షూటింగ్ షురూ
You are at idlebrain.com > news today >
Follow Us

25 August 2021
Hyderabad


We all know that King Akkineni Nagarjuna is known to explore variety of films in every genre known to us in his decade long career. He also Enjoys huge fan base be it the youth or among family audiences.

Soggade Chinni Narayana directed by Kalyan Krishna Kurasala was a highest grosser for Nagarjuna.

The team is coming up with its sequel titled Bangaraju and this much awaited film will feature Nagarjuna’s elder son Yuva Samrat Akkineni Naga Chaitanya in other lead role.

The celebrated father-son duo previously appeared together in Akkineni’s multi-starrer Manam which is remembered as one of the all-time classic blockbuster and also as one of the most memorable film for the Akkineni family and fans all over the world.

Ramya Krishna who was paired in Soggade Chinni Narayana, is part of Bangaraju as well. The makers have roped in the most sought-after heroine Krithi Shetty to play Naga Chaitanya’s love interest.

The craziest multi-starrer was launched recently and the regular shoot has commenced from today in Hyderabad.

Anup Rubens scores music for the film. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.

Bangaraju is billed to be a wholesome entertainer with a total dose of romance, emotions and other commercial elements. Expectations are quite high on this project, since it is the sequel for the blockbuster.

Zee Studios will be co-producing the project with Annapurna Studios Pvt Ltd.

Cast:
Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi

Technical Crew:
Story & Direction: Kalyan Krishna Kurasala
Producer: Akkineni Nagarjuna
Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd
Screenplay: Satyanand
Music: Anoop Rubens
DOP: Yuvaraj
Art Director: Brahma Kadali
PRO: Vamsi-Shekar

అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ బంగార్రాజు షూటింగ్ షురూ

ఎన్నో ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో వెర్సటాలిటీని క‌న‌బ‌రుస్తూ, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ ప్ర‌తి జ‌న‌రేష‌న్‌ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయ్యే సినిమాల‌తో అల‌రిస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున‌. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అద్భుత‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సోగ్గాడే చిన్నినాయ‌న‌... మ‌న కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ మూవీ.

ఈ సినిమాకి సీక్వెల్‌గా బంగార్రాజు తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జున పెద్ద కొడుకు యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కీ ఎంతో ప్ర‌త్యేక‌మైన ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌నంలో ఈ తండ్రీ కొడుకులు ఇంత‌కు ముందు క‌లిసి న‌టించారు.

సోగ్గాడే చిన్నినాయ‌నా మూవీలో నాగార్జున ప‌క్క‌న గ్రేస్‌ఫుల్‌గా క‌నిపించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు బంగార్రాజులోనూ న‌టిస్తున్నారు. కుర్ర‌కారు మ‌న‌సు దోచుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టిని నాగచైత‌న్య ప‌క్క‌న ఫిక్స్ చేశారు మేక‌ర్స్.

ఈ క్రేజీయ‌స్ట్ మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బుధ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. స‌త్యానంద్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహ‌కుడిగా యువ‌రాజ్ ప‌నిచేస్తున్నారు.

రొమాన్స్, ఎమోష‌న్స్, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అత్య‌ద్భుత‌మైన క‌ల‌యిక‌గా బంగార్రాజు హోల్‌స‌మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ ప్రాజెక్ట్ మీద హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి.

అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీ స్టూడియోస్ స‌హ నిర్మిస్తోంది.

న‌టీన‌టులు:
అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ‌చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి, చ‌ల‌ప‌తిరావు, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిశోర్‌, ఝాన్సీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, మాట‌లు: క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌
నిర్మాత‌: అక్కినేని నాగార్జున‌
బ్యాన‌ర్స్: జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌
స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: యువ‌రాజ్‌
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
పీఆర్ ఓ : వంశీ - శేఖ‌ర్

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved