pizza
Barrister Shankar Narayan movie on 21 September
You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2013
Hyderabad

'బారిష్టర్ శంకర్ నారాయణ్' సెన్సార్ పూర్తి: సెప్టెంబర్ 21న విడుదల

రాజ్ కుమార్ కధానాయకునిగా నటిస్తున్న చిత్రం. సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు 'తార' ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో సకుటుంబ సపరి వార సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ఈ 'బారిష్టర్ శంకర్ నారాయణ్' చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం గురించి...
రాజ్ కుమార్ మాట్లాడుతూ..'
చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేయ నున్నామని తెలిపారు.తన వాగ్ధాటితో ఎంతటి న్యాయవాదినైనా బోల్తా కొట్టించే న్యాయవాదిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ నారాయణ్ ఒక కేసు టేకప్ చేశాడంటే, ఇక ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరుగెట్టాల్సిందే. అలాంటి 'బారిష్టర్' జీవితంలో ఒక కేసు మూలంగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చోటు చేసుకున్న పరిస్థితిని ఆ న్యాయవాది ఎలా ఎదుర్కున్నాడు? అన్న అంశంతో ఆసక్తికరంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ తార తొలిసారిగా దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తనకు మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిపెడుతుందని రాజ్ కుమార్ చెబుతున్నారు. నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని చూపించే ఈ చిత్రం లోని 'బారిష్టర్ శంకర్ నారాయణ్' పాత్ర ఆర్టిస్ట్ గా మంచి పేరుతోపాటు అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశంమెండుగా ఉంది అన్నారు చిత్ర దర్శకురాలు 'తార'
ఎం.ఎస్.నారాయణ.ఏవీఎస్.అనంత్,కిశోర్ దాస్. హేమ,అపూర్వ ల పాత్రలు ఎంతో వినోదాన్ని పంచుతాయని దర్శకురాలు తెలిపారు.అలాగే 'సాకేత్' సంగీతం సంగీత ప్రియులను అలరిస్తోంది.. కదానుగుణం గా సాగే వెంకట్ మాడ భూషి సంభాషణలు ఆలోచింప చేస్తాయి. ఎస్.వి.శివారెడ్డి చాయాగ్రహణ పనితనం ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి.

సెప్టెంబర్ 21 న విడుదల అవుతున్న ఈ చిత్రం దర్శకురాలిగా తనకు మంచి భవిష్యత్ ను కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దర్శకురాలు 'తార'.

అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో లక్ష్మి,హేమ,అపూర్వ,ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్,అనంత్,మహర్షి,కిశోర్ దాస్,శ్రీరాం ,శశాంక్, సింగం మహేష్, టంగుటూరి రామకృష్ణ,రవిదాస్, వీడియోకాన్ రామ చంద్రారెడ్డి, ఆంజన్ బాబు, ప్రత్యేక పాత్రలో 20 సూత్రాల పధకం చైర్మన్ 'ఎన్.తులసి రెడ్డి' నటించారు.

సాంకేతిక నిపుణులుగా..మాటలు: వెంకట మాడభూషి, సంగీతం; సాకేత్, పాటలు; భువనచంద్ర:,కెమెరా: ముప్పాళ్ళ మహేష్ , ఎడిటింగ్: గౌతంరాజు: ఆర్ట్ రామకృష్ణ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎల్.వేణుగోపాల్
నిర్మాత: వి.వి.రాజ్ కుమార్
సమర్పణ: శ్రీమతి రమా రాజ్ కుమార్
కొరియోగ్రఫీ - దర్శకత్వం: ఎన్.ఏ.తార

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved