pizza
Beautiful movie censor completed
రాంగోపాల్ వర్మ బ్యూటిఫుల్ సెన్సార్ పూర్తి
You are at idlebrain.com > news today >
Follow Us

4 December 2019
Hyderabad

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ ...త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్నిమలచడం జరిగింది. హీరోహీరోయిన్లు సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అలాగే చిత్రం కూడా ఆధ్యంతం అలరిస్తుంది అని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, , రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved