pizza
Ravi Teja's Bengal Tiger music launch on 17 October, film release on 5 November
You are at idlebrain.com > news today >
Follow Us

28 September 2015
Hyderabad

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 17న ఆడియో, దీపావ‌ళి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా
నవంబర్ 5న విడుద‌ల కానున్న మాస్‌మ‌హారాజ్ ' బెంగాల్‌టైగ‌ర్ '

మాస్ మహరాజ రవితేజ ఎన‌ర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్‌టైగ‌ర్‌. సంపత్ నంది ద‌ర్శ‌కుడు. అందాల ముద్దుగుమ్మలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన
అభిరుచివున్న నిర్మాణ‌సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మాత‌. రవితేజ కెరీర్లోనే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించారు. ప్రస్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భీమ్స్ అందించిన ఆడియో ని అక్టోబర్ 17న గ్రాండ్ గా మాస్‌మ‌హారాజ్ అభిమానుల సమ‌క్షంలో చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా నవంబర్ 5న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ ని పూర్తిచేసాము. ముందుగా అన్నికార్క‌క్ర‌మాలు పూర్తిచేసి దసరా కానుకగా బెంగాల్ టైగర్ చిత్రాన్ని విడుదల చేయాలని భావించాం. కానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ బ్రూస్ లీ చిత్రం అక్టోబ‌ర్ 16న, అక్కినేని
వారసుడు అఖిల్ నటించిన చిత్రం అక్టోబ‌ర్ 22న విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా, మా చిత్రం బెంగాల్ టైగర్ ని దీపావళి కానుకగా నవంబర్

5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో రవితేజ న‌ట‌న అందిరిని ఆక‌ట్టుకుంటుంది. బ్ర‌హ్మ‌నందం గారి కామెడికి చూసిన ప్ర‌తిప్రేక్ష‌కుడు న‌వ్వుకుంటారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా భీమ్స్ పాటలందించారు. అక్టోబర్ 17న బెంగాల్ టైగల్ పాటల్ని సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం. అని అన్నారు.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌

నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved