pizza
SS Thaman Birthday (16 November) interview (Telugu) about Jawan
కావాలనే సమయం తీసుకుంటున్నాను - ఎస్.ఎస్.థమ‌న్
You are at idlebrain.com > news today >
Follow Us

15 November 2017
Hyderabad

సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం `.జ‌వాన్‌`. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమ‌ర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలవుతుంది. ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్ పుట్టినరోజు నవంబర్ 16. ఈ సందర్భంగా ‘జవాన్’ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమ‌న్‌తో ఇంటర్వ్యూ...

సమయం తీసుకంటున్నాను..
- 50 సినిమాలను త్వర త్వరగా చేసేశాను. ఇప్పుడు కాస్త నెమ్మదిగా వెళదావునిపించింది. దాంతో టైమ్ తీసుకుంటున్నాను. ముందులా అన్ని కవుర్షియల్ సినిమాలనే చేయాలనుకోవడం లేదు. కొత్త తరహా సినిమాలను చేయాలనుకోవడంతో వెరైటీ సినిమాలను ఎంచుకుంటున్నాను. ఇప్పుడు వస్తోన సినిమాల్లో కొత్తదనం ఎక్కువగా ఉంటుంది.

ఆమె మంచి సింగర్..
- `జవాన్` సినిమా పాటలన్ని బాగా వచ్చాయి. ముఖ్యంగా రాశిఖన్నా మంచి సింగర్ కావడంతో ఆమెతో పాట పాడించాలని ముందుగానే అనుకున్నాను. అల్రెడి ‘జిల్’ సినిమాలో పాడింది. బివిఎస్‌ఎన్ ప్రసాద్ సినిమా ‘తొలిప్రేమ’ షూటింగ్‌లో రాశి పాడటం విన్నాను. తను చాలా బాగా పాడుతుందని..తేజుతో మాట్లాడాను. అప్పుడు తేజు తప్పకుండా పాడించమని చెప్పాడు.

ప్రమోషన్స్‌లో ఇదొక విధానం..
- సినిమాలోని ఐదు పాటల్లో మూడు పాటలు అల్రెడి విడుదైలెయ్యాయి. ఒకప్పుడు ఓ సినిమాకు సంబంధించిన ఆరు పాటలు ఒకేసారి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కొక్క సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో ఇదొక కొత్త విధానం. ఇలాంటి ప్రమోషన్స్ వల్ల సినిమాకు సంబంధించి ఐడెంటిటీ ఎక్కువగా ఉంటుంది.

interview gallery

ఏ డైరెక్టర్ అలా అనుకోడు..
- ఏ డైరెక్టర్..నిర్మాత..మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్లాప్ సినిమా చేయాలనుకోడు. అందరూ కొత్తగా అటెంప్ట్ చేయాలనే చూస్తారు. అది ప్రేక్షకులకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా చేసేటప్పుడు హీరో ఇవేుజ్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తాం. ప్రస్తుతం తెలుగులో హీరోల క్యారెక్టర్ చుట్టూనే సినిమాలు ఎక్కువగా ఉంటున్నాయి. హీరో చెట్టులాంటివాడు అయితే డైరెక్టర్ వేరులాంటివాడు. మిగతా టెక్నిషియన్స్ అందరం కొమ్మలులాంటివాళ్లం.

అక్కడ స్పేస్ ఎక్కువగా ఉంటుంది..
- హారర్ సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయుడానికి స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అదే కవుర్షియల్ సినిమా విషయానికి వస్తే, సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి. రీసెంట్‌గా నా మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన `మహానుభావుడు`, `రాజుగారి గది 2` చిత్రాలకు మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి పేరొచ్చింది.

ఆ నమ్మకం ఇద్దరికీ ఉంది.
- నేను, సాయిధరమ్ ఒక తల్లి కడుపున పట్టలేదంతే తప్ప..ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మా కాంబినేషన్‌లో వచ్చిన `తిక్క`, `విన్నర్` సినిమాలు కమ‌ర్షియుల్‌గా అనుకున్నంత పెద్ద సక్సెస్ సాధించలేదు. కానీ మ్యూజికల్‌గా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ విషయం మాకు కూడా తెలుసు. అయితే మా కాంబినేషన్‌లో తప్పకుండా పెద్ద హిట్ కొడతామనే నమ్మకం గట్టిగా ఉంది. తనతో చేసిన ‘జవాన్’ విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా..వినాయుక్‌గారి సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను. అలాగే తేజు చేయుబోయే మరో రెండు సినిమాలకు కూడా సంగీతం అందించబోతున్నాను.

- బాలీవుడ్‌లో గోల్‌మాన్ ఎగైన్ సినిమా చేశాను. త్వరలోనే హిందీ ‘టెంపర్’ రీవేుక్‌కి మ్యూజిక్ అందించబోతున్నాను.

పుట్టినరోజు ఎలా సెలబ్రేషన్స్..
పర్టికులర్‌గా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు. రీసెంట్‌గా లండన్ వెళ్లినప్పుడు..మ్యూజిక్‌కి సంబంధించిన కొన్ని కొత్త పరికాలను తెచ్చుకున్నాను. వాటిని రేపు నా స్టూడియో ఎలా పనిచేస్తున్నాయో చెక్ చేసుకోవడమే, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు భావిస్తాను. ప్రతి పుట్టినరోజును ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved