pizza
Sharwanand Birthday (06 March 2016) Interview
అందరి దర్శకులతో వర్క్ చేయాలనుంది - శర్వానంద్
You are at idlebrain.com > news today >
Follow Us

05 March 2016
Hyderaba
d

‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్న హీరో శర్వానంద్. కథలు చాలా ముఖ్యం, అందుకే మంచి కథల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నానని అంటున్న శర్వానంద్ తో పుట్టినరోజు మార్చి 6. ఈ సందర్భంగా శర్వానంద్ తో ఇంటర్వ్యూ...

బర్త్ డే నిర్ణయాలంటూ ప్రత్యేకంగా తీసుకోను...
-ప్రతి పుట్టినరోజును ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళుతుంటాం. ఈ బర్త్ డే విషయానికి వస్తే ఎక్స్ ప్రెస్ రాజు సక్సెస్ తో చాలా హ్యపీగా ఉన్నాను. ఆ సినిమా సక్సెస్ తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరం హ్యపీయే.

నాకు సంబంధం లేదు...
-చేరన్ దర్శకత్వంలో తమిళంలో చేసిన చిత్రాన్ని అక్కడ డివిడిల రూపంలో విడుదల చేశారు. ఇప్పుడు ‘రాజాధిరాజా’ పేరుతో తెలుగులో విడుదల చేయడమేంటో అర్థం కావడం లేదు. అది నిర్మాతల విషయం. నాకు సంబంధం లేదు.

ఆ సినిమాలనే చేయాలనుకుంటున్నా...
-ఎక్కువగా కమర్షియల్ ఫార్మేట్ లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. వీలైనన్ని సినిమాలు చేయాలనేదే ఆలోచన. అయితే స్క్రిప్ట్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాను. అందువల్ల సినిమాలు సెట్స్ లోకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే కానీ నేను సినిమా చేయడం లేదు.

నా ప్రొడక్షన్ లో ప్లాన్ చేయలేదు...
-నా ప్రొడక్షన్ లో కొత్త సినిమాలను ఏమీ ప్లాన్ చేయడం లేదు. అయితే తప్పకుండా సినిమా చేస్తాను.

మల్టీస్టారర్ ప్లానింగ్....
-మంచి కథలు కుదిరితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నేను రేడీయే. అలాగే వెన్నెల తరహాలో నెగటివ్ రోల్స్ సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధమే.

Sharwanand Birthday interview gallery

నేను కలుగచేసుకోను...
-సాధారణంగా స్క్రిప్ట్ ఓకే చెప్పేసిన తర్వాత నేను కలుగచేసుకోను. అయితే స్క్రిప్ట్ వినగానే మంచిదా, కాదా అని చెప్పగలను.

25వ సినిమా గురించి....
-తెలుగు, తమిళంతో కలుపుకుంటే నా నెక్ట్స్ మూవీ 25వ మూవీ అవుతుంది. అయితే ఇన్నేళ్ళ జర్నీ కారణం నా శ్రేయోభిలాషులే. చాలా హ్యపీగా ఉన్నాను. అయితే ఇందులో వెన్నెల, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా ఇలా చాలా సినిమాలు నా మనసుకు మరీ దగ్గరైన సినిమాలు.

ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను...
-నా సినిమాలను కంట్రోల్ బడ్జెట్ లో చేయాలనుకుంటాను. నా లిమిట్ దాటి చేయడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడతారు. అది నాకు ఇష్టం ఉండదు.

నిర్మాతలే పెంచుతున్నారు...
-నాతో సినిమా చేస్తున్న నిర్మాతలే నా రెమ్యునరేషన్ ను పెంచుతున్నారు. అయితే ఊరకనే ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
-నాకు రాజమౌళి, మణిరత్నం, పూరిజగన్నాథ్ గారు సహా అందరితో వర్క్ చేయాలనుంటుంది. పూరి జగన్నాథ్ గారైతే హీరోను మరోలా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు నా నెక్ట్స్ మూవీ కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. ముగ్గురితో సినిమాలు చేస్తాను. అయితే ఎవరితో ముందుగా చేస్తానో ఇప్పుడే చెప్పలేను.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved