pizza
Vishal Birthday interview
ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌ వుంటూనే ఓ మంచి పర్పస్‌ఫుల్‌ ఫిలింగా ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది - మాస్‌ హీరో విశాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 August 2016
Hyderaba
d

Hero Vishal is well known in Tollywood with his mass films. His latest is 'Okkadochaadu' produced by G.Hari and Directed by Suraaj. Vishal is celebrating his birthday on Aug 29. On this occasion Vishal shared details about his upcoming film,

"After superhits like Pandem Kodi,Pogaru,Bharani,Pooja,Rayudu now I am doing a very good film 'Okkadochaadu'.Everywhere in the world someone needs to raise against evil. 'Okkadochaadu' is also about that someone who will raise his voice and do justice to the people around him.This film is being made as a purposeful and powerful film packaged with perfect commercial elements like entertainment and romance. When Director Suraaj told me about this point, I immediately stopped all my projects and started this film. I am that connected to this film. It has such a good point that everyone will relate themselves to it.My look and characterisation in this film is completely different to my earlier films. Thamannah is playing as Heroine and Jagapathi Babu is doing a very important role. Tarun Arora is acting as villain. I am very happy that my birthday is being celebrated on the sets of 'Okkadochaadu' film, which is very close to my heart. I am very confident that 'Okkadochaadu' which will release as Diwali gift will become another superhit film in my career. My next film with Director Mysskin under my production Vishal Film Factory will start from September 12th. G.Hari is producing 'Okkadochaadu' in Telugu."

Young Producer G.Hari is producing Vishal-Thamannah starrer 'Okkadochaadu' under his banner Hari Venkateswara Films, while G.Purushottam is presenting it. Speaking about the film's progress Producer G.Hari said, " This is highest budgeted film in Hero Vishal's career. This film is a perfect commercial package with Action, Entertainment and very good music. Unit will move to Russia to picturise songs in beautiful locations from September 3rd. A chase filmed by spending 1.5 Crores in the supervision of action director Kanal Kannan and a song picturised lavishly in a set erected with 1 crore under the supervision of choreographer Shobhi will be major highlights in this film. Song sung by Star Heroine Shruthi Hasan for Heroine Thamannah is another attraction in this film."

Along with Vishal - Thamannah, Prime Star Jagapathi Babu will be seen in a very important role in this big budgeted film. Sampathraj,Charan,Jayaprakash are playing other roles.

Music : HipHop Thamizh, Cinematography : Richard.M.Nathan, Dialogues : Rajesh.A. Murthy, Lyrics : Dr Challa Bhagya Lakshmi, Editing : R.K Selva, Choreography : Finish, Shobhi, Co-Producer : E.K Prakash, Producer : G.Hari, Story-Screenplay-Direction : Suraaj.

ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌ వుంటూనే ఓ మంచి పర్పస్‌ఫుల్‌ ఫిలింగా ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది - మాస్‌ హీరో విశాల్‌

''పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్‌ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా ఈ సినిమాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రశ్నించడానికి, వాళ్ళకి న్యాయం చెయ్యడానికి 'ఒక్కడొచ్చాడు'. అదే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో వుండే ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ అన్నీ వుంటూనే ఒక పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ ఫిలింగా 'ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది. దర్శకుడు సురాజ్‌ ఈ స్టోరీ లైన్‌ చెప్పగానే ఇమ్మీడియట్‌గా అన్ని సినిమాలూ ఆపి ఇదే ముందు స్టార్ట్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాను. అంతగా ఈ కథకు నేను కనెక్ట్‌ అయ్యాను. ఇందులో ఒక కొత్త పాయింట్‌ వుంది. అది అన్ని ఊళ్ళల్లో అందరూ నిత్యం ఫేస్‌ చేసేదే. ఆ పాయింట్‌ చుట్టూ అల్లిన మంచి కమర్షియల్‌ సినిమా ఇది. ఇందులో నా లుక్‌, క్యారెక్టరైజేషన్‌ ఇంతకుముందు సినిమాలన్నింటి కంటే డిఫరెంట్‌గా వుంటుంది. తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. జగపతిబాబు ఒక ముఖ్యపాత్ర చేస్తున్నారు. తరుణ్‌ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ బర్త్‌డేకి 'ఒక్కడొచ్చాడు' షూటింగ్‌లో వుండడం నాకు ఎంతో ఆనందంగా వుంది. నామనసుకి నచ్చిన సినిమా షూటింగ్‌లో నా బర్త్‌డే జరుపుకోవడం నిజంగా రియల్‌ హ్యాపీ బర్త్‌డేగా ఫీల్‌ అవుతున్నాను. దీపావళి కానుకగా వచ్చే 'ఒక్కడొచ్చాడు' డెఫినెట్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకొని నా కెరీర్‌లో మరో మంచి హిట్‌ సినిమాగా నిలుస్తుందని నా నమ్మకం. సెప్టెంబర్‌ 12 నుండి మిస్కిన్‌ డైరెక్షన్‌లో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మరో చిత్రం ప్రారంభిస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' తెలుగులో జి.హరి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది'' అన్నారు ఆగస్ట్‌ 29 తన బర్త్‌ డే సందర్భంగా 'ఒక్కడొచ్చాడు' సినిమా విశేషాలను తెలియజేస్తూ మాస్‌ హీరో విశాల్‌.

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు' ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''విశాల్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, అద్భుతమైన మ్యూజిక్‌లతో పాటు ఆల్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న చిత్రం ఇది. సెప్టెంబర్‌ 3 నుండి రష్యాలో బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరిస్తాం. విశాల్‌ బర్త్‌డే ఆగస్ట్‌ 29 సందర్భంగా టీజర్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. కోటి 50 లక్షల వ్యయంతో కనల్‌ కణ్ణన్‌ సారధ్యంలో తీసిన ఛేజ్‌ ఈ సినిమాకి ఓ హైలైట్‌. అలాగే విశాల్‌, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో తీసిన పాట స్పెషల్‌ ఎట్రాక్షన్‌. హీరోయిన్‌ తమన్నాకి మరో హీరోయిన్‌ శృతిహాసన్‌ పాట పాడడం మరో విశేషం'' అన్నారు.

విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved