pizza
Brahmanandam to be felicitated in 12th South Asian film festival, Seattle
అమెరికా లో డా. బ్రహ్మానందం కి అరుదైన గౌరవం
You are at idlebrain.com > news today >
Follow Us

3 October 2017
Hyderabad

The timing of the visit of super comedian star Bramhanandam to Seattle couldn't have been any better with growth of Telugu speaking workforce in the local IT Industry including Amazon and consistent formation of start ups on a daily basis. The credit also goes to PeopleMedia, a PeopleTech group of company, which is producing the latest Bramhanandam starting "Achari America Yatra".

During his stay the legendary Bramhanandam will be the guest of honor at the opening Red Carpet Gala of Tasveer 12th South Asian Film Festival in Seattle, the largest of its kind in the whole world. The Gala will take place at the coveted Seattle Art Museum on the evening of October 6th. The star will also be felicitated by the South Asia Center of the University of Washington on October 7th. Many other events are being organized to celebrate the Successes of the star along with the festivities attached to the festival season

అమెరికా లో డా. బ్రహ్మానందం కి అరుదైన గౌరవం

అక్టోబర్ 6న అమెరికా లోని సియాటెల్ నగరం లో జరుగబోవు తస్వీర్ 12 వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిధిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోమని ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత , వెయ్యి చిత్రాలతో గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసిన డాక్టర్ బ్రహ్మానందం కి ఆహ్వానం అందింది . ఇదే వేదిక పై అక్టోబర్ 7 న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందం ని ఘనంగా సన్మానించనుంది . ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని పొందిన రెండో నటుడు ఎస్వీ రంగారావు తర్వాత బ్రహ్మానందం మాత్రమే . 1964 జకార్తా చిత్రోత్సవాల్లో నర్తన శాల చిత్రానికి గాను ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా ఎస్వీఆర్ అవార్డు పొందిన తర్వాత తిరిగి ఇన్నేళ్లకు ఒక తెలుగు నటుడి విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ముదావహం . బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ . ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ నిమిత్తం అమెరికా లోనే షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం ఈ ఆహ్వానానికి అంగీకారం తెలిపారు. నిన్ను కోరి చిత్రం తర్వాత ఆచారి అమెరికా యాత్ర చిత్రానికి అమెరికా లో లైన్ ప్రొడక్షన్ చేస్తున్న పీపుల్ మీడియా సంస్థ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ మీడియా కు ఈ వార్త తెలియ జేస్తూ తమ హర్షాన్ని ప్రకటించారు. తెలుగు వాడి పెదవులపై చెరగని చిర్నవ్వు మన బ్రహ్మానందం గారని , ఇటువంటి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలకు వారు అర్హుడని కొనియాడారు .


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved