pizza
Business craze for Vaisakham - BA Raju
బిజినెస్‌ పరంగా 'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషల్‌ క్రేజ్‌ వచ్చింది - నిర్మాత బి.ఎ.రాజు
You are at idlebrain.com > news today >
Follow Us

23 February 2017
Hyderabad

We started the shooting of Vaisakam with the blessings of Lord Shiva from Keesaragutta Shiva Temple and now as we have completed the shooting on Shivarathri. Vaisakham is produced on RJ Cinema banner by BA Raju and directed by Dynamic Lay Director B Jaya. It stars Harish and Avantika in lead roles.

Fancy price for overseas rights
Films like Pellichoopulu and Shatamanam Bhavati have performed sensationally in overseas. Those performances has increased buzz on small films and it can be seen with huge interest on the film Vaisakham. Amidst huge competition the Overseas rights have been bought for fancy price by Blue Sky Entertainments.

There is a similar craze for the film in Telugu states. Buyers from various territories are offering crazy prices to acquire the rights. It is because all the films that have been made by B Jaya like Premalo Pavani Kalyan, Chantigadu, Gundamma Gari Manavadu, and Lovely were money spinners. There is a trust on the films coming from RJ Cinemas banner and hence the huge interest.

Vaisakham has blessings of Shiva – B Jaya
Not only did the film start at a Shiva temple, there is a scene in the film where we did Chandiyagam. The blessings of Shiva has been there from the start and it feels good to share that the shooting is completed for Shivarathri.

Vaisakham is a film that will appeal to youth and family alike. It will bring me bigger laurels than Lovely and I am hopeful that it will also be my biggest success. I am extremely satisfied with the film.

Viashakam stars Harish and Avanthika in lead roles. Dialogue King Sai Kumar plays an important role in the movie.

Cast:
Eeshawari Rao, Rama Prabha, Prudhvi, Kashi Vishwanath, Krishna Bhagwan, Sri Lakshmi, Gundu Sudarshan, Apparao, Seshu, Bhadra, Sampoo, Phani Madhvi, Jenni, Jabardasth Team Venki, Sridhar, Ram Prasad, Prasad, Teja, Shashank, Lateesh, Keerthi Naidu, Parameshwari, Govindrao, Neeranna Chowdhary, Raja Boyidi, Latha Sangaraju, Lavanya, Mounika, Chandini, Ishani Kalyani Kamre, Shahjahan Sujane,

Crew:
DOP: Valishetty Venkata Subbarao
Music Director: DJ Vasanth
Dance: VJ Sekhar
Art: Murali Kondeti
Fights: Venkat, Ram Sunkara
Stills: Sreenu
Co-Director: Amaraneni Naresh
Production Executive: Subbarao
Line Producer: B Shiva Kumar
Producer: BA Raju
Writer, Editor and Direction: B Jaya

బిజినెస్‌ పరంగా 'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషల్‌ క్రేజ్‌ వచ్చింది - నిర్మాత బి.ఎ.రాజు

''కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో షూటింగ్‌ ప్రారంభమైన మా 'వైశాఖం' దిగ్విజయంగా శివరాత్రికి పూర్తయింది'' అన్నారు నిర్మాత బి.ఎ.రాజు. ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హరీష్‌-అవంతిక జంటగా బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది.

ఫ్యాన్సీ ఆఫర్‌తో ఓవర్సీస్‌ రైట్స్‌ స్వంతం చేసుకున్న బ్లూ స్కై సంస్థ!!
'పెళ్లిచూపులు', 'శతమానం భవతి' వంటి చిత్రాలు ఓవర్సీస్‌లో సూపర్‌హిట్స్‌ అవడంతో రాబోయే చిన్న చిత్రాల్లో 'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషన్‌ క్రేజ్‌ వచ్చింది. అందుకే 'వైశాఖం' ఓవర్సీస్‌ రైట్స్‌ కోసం చాలామంది పోటీ పడ్డారు. అయితే ఫ్యాన్సీ ఆఫర్‌ ఇచ్చి బ్లూ స్కై సంస్థ 'వైశాఖం' ఓవర్సీస్‌ రైట్స్‌ స్వంతం చేసుకోవడం బిజినెస్‌ సర్కిల్స్‌లో ఈ సినిమాకి మరింత క్రేజ్‌ తీసుకొచ్చింది. నైజాం ఏరియాకి, ఆంధ్రా, సీడెడ్‌ ఏరియాలకు బయ్యర్స్‌ చాలామంది ఆఫర్స్‌ ఇస్తున్నారు. ఈమధ్యకాలంలో బిజినెస్‌పరంగా ఏ సినిమాకీ లేని క్రేజ్‌ 'వైశాఖం'కి రావడానికి కారణం జయ బి అందించిన 'ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' అన్నీ బయ్యర్స్‌కి లాభాల్ని తెచ్చిపెట్టిన హిట్‌ సినిమాలు కావడమే. అలాగే ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో సినిమా అంటే పబ్లిసిటీ విషయంలో కాంప్రమైజ్‌ అవకుండా పెద్ద స్థాయిలో చేస్తారన్న నమ్మకం బయ్యర్లందరిలో వుండడం వలన స్పీడ్‌గా బిజినెస్‌ అవుతోంది.

'వైశాఖం'కి శివుడి అనుగ్రహం వుంది
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''శివుడి గుడిలో 'వైశాఖం' ప్రారంభించడమే కాదు.. కథ ప్రకారం ఓ సన్నివేశంలో చండీయాగాన్ని శాస్త్రోక్తంగా జరిపించాం. అలా శివుడి అనుగ్రహం వున్న ఈ సినిమా షూటింగ్‌ శివరాత్రికి పూర్తవడం విశేషం. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికీ నచ్చే మంచి ఫీల్‌గుడ్‌ మూవీ 'వైశాఖం'. 'లవ్‌లీ' కంటే నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. దర్శకురాలిగా నాకు సంతృప్తి కలిగించిన ఈ సినిమా కమర్షియల్‌గా నా చిత్రాలన్నింటి కంటే పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకుంది'' అన్నారు.

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved