pizza
BVSN about Nannaku Prematho success
ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..' అద్భుత విజయం సాధించి
50 కోట్ల షేర్‌ క్రాస్‌ చేసినందుకు చాలా ఆనందంగా వుంది
- భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 January 2016
Hyderaba
d

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్‌ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..' సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌ అయింది. ఈ చిత్రం సాధించిన అద్భుత విజయంపై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఓ మంచి కథాంశంతో ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..' చిత్రాన్ని ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించి అఖండ విజయాన్ని చేకూర్చారు. 'నాన్నకు ప్రేమతో..'లో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా వుందని, ఇందులో ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూసామని, కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఆనందించ దగ్గ మంచి సినిమాగా సుకుమార్‌ ఈచిత్రాన్ని తీర్చిదిద్దారని అందరూ అభినందిస్తుంటే ఆనందంగా వుంది. అంతేకాదు కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం 50 కోట్ల షేర్‌ని క్రాస్‌ చేసి ఇంకా బ్రహ్మాండమైన కలెక్షన్స్‌తో రన్‌ అవడం మంచి చిత్రానికి ఎప్పుడూ ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తారన్న విషయం మరోసారి ప్రూవ్‌ అయింది. ముఖ్యంగా 'నాన్నకు ప్రేమతో' యు.ఎస్‌లో కేవలం రెండు వారాల్లోనే 2 మిలియన్స్‌ కలెక్ట్‌ చేయడం మరింత ఆనందంగా వుంది. ఇంతటి అపూర్వమైన విజయాన్ని అందించిన ప్రేక్షకలోకానికి, ఎన్టీఆర్‌ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved