pizza
Celebrities condolences to Dasari Narayana Rao
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2017
Hyderabad


దాసరి గారి మరణం షాక్‌కి గురిచేసింది: చిరంజీవి
దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడటం జరిగింది. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ‌లు అనీర్వచనీయం. ఇప్పటివరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. బౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవల‌ను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం....చిరంజీవి

Legendary film maker and politician Dasari Narayana Rao’s sudden death has come like a rude shocker for Telugu film fraternity. In tears, film celebrities have left condolence message remembering the great services offered by Dasari to our industry.

Balakrishna – Dasari took Telugu cinema’s motion onto a new path. I express my deep condolences on his death.

Mohan Babu – The life my family is enjoying today is the blessing from Dasari. I pray Lord Sai to take care of my godfather’s soul.

Director Krish - Dasari lives long in our memories till the time cinema exists on this earth. Dasari is a personification of 24 crafts and a unique power. He earned immense respect for director’s seat and made entire film industry realize that Director is Captain of the cinema.

Boyapati Srinu – Darshaka Dronacharya Dasari is a pinnacle in Telugu cinema. Let the entire director community walk in his footsteps fulfilling his ideals.

Sriwass – Dasari is a flash of inspiration for me and a leader for Telugu cinema. We need time to absorb this tragic news.

Gopichand – As a director and industry big head, we cannot recover this loss.

Sai Korrapati – Dasari was partial towards producers and worked for securing the interests of producers. I am unable to digest the news.

Nara Rohith – Dasari lived a purposeful life for the well being and development of Telugu cinema.

Sampath Nandi – In spite of Dasari’s physical absence in between us, his inspirational words and teachings drive us forever.

Producer PVP – Though Dasari is physically not between us but his achievements will remain forever.

Director N Shankar – Telugu cinema expanded its wings proudly under the visionary direction of Dasari.

Director Teja – For the first time Dasari proved that stardom is not just meant for heroes. His demise is an irrecoverable loss.

Sharwanand - Dasari is a pride of Telugu people. H enhanced the respect for directors. May his soul rest in peace!

Bellamkonda Sai Sreenivas - I pray for Dasari’s soul to rest in peace. Industry lost a legendary person.

Manchu Vishnu, Manoj – Dasari is not only a head personality for industry, he is the head of our family. This is a personal loss for us.

Producer Ashwini Dutt – Dasari is one of those rare directors worked for well being of producers. He is a true producer’s director. Industry needs to learn a lot from him.

Chandoo Mondeti - Dasari is not only a legendary director, he is a precious jewel in the crown of Telugu cinema. We miss him.

Vijay Devarakonda – Dasari garu is an inspirational force for many young artists including me.

Kranthi Madhav – Dasari garu blessed me by watching my first film and encouraged me to do more good films.

Raj Kandukuri – Dasari garu stood as pillar support in release of our Pellichoopulu. We are unable to tolerate the news of his demise.

Sree Vishnu – Dasari was a great man. He was one of the early ones to have blessed me as an actor. Industry lost a good human being.

Director Ravi Babu – I am influenced a lot as an artist and director by Dasari gari films. I am deeply pained hearing the sad news.

Indraganti Mohana Krishna – I’ve developed a quality of imbibing Telugu values in my films only by watching Dasari garu.

Sudheer Varma – Irrespective of age, Dasari garu had an attitude of encouraging all the talented people coming into industry. I pray for his soul to rest in peace.

J Bhagawan, J Pulla Rao – Film industry lost a pillar personality today. He resolved many issues connected to this field. Let god give his family members enough strength to overcome these toughest times.

- దర్శకుడిగా, పెద్ద దిక్కుగా దాసరిగారు చిత్రసీమకు అందించిన సేవలు చిరస్మరణీయం. నేను నిర్మాతగా మారిన తొలినాళ్లలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అందరూ నావారే అనుకుని అందరి బాగోగుల కోసం నిరంతరం శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి దాసరి.
ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను. - నిర్మాత ఏ.ఎం.రత్నం

దాసరి గారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు -నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా గమనానికి సరికొత్త దారి చూపిన దాసరి గారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను.

నాకు జీవితాన్నిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా -మోహన్ బాబు
నాకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాను.

Sri darsakaratna dasari gari Mruti ki santapa soochakamga repatinunchi 3 rojulapatu maa chitram shooting kaaryakramalu nilipi veyatam jarugutondi. Dasari gari Maruti Maa ku teerani lotu. Ayana aatmaku santi chekooralani AA bhagavantudini praardhistunnaamu. Ayana kutumbaanimi maa pragadha sanubhooti teliya chestunnamu. - Haarika & hassine creations unit Pawankalyan- Trivikram Producer Suryadevara Radhakrishna

చిత్రపరిశ్రమకు తీరని లోటు : రామ్‌చరణ్‌
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కల‌గాల‌ని కోరుకుంటున్నాను..రామ్ చ‌ర‌ణ్

"Sri Dasari Narayana Rao's death is an irreplaceable loss - End of an ERA for the Telugu Film Industry. Shocked & Saddened to hear the news while in London. Strength to the family. May his soul rest in peace." - Ram Charan

Rest in Peace Dr Dasari Narayana Rao Garu. A huge loss to the Telugu Film Industry. Praying for strength to the family - Kalyan Ram

Jaateeya sthayilo telugu cinema keertini vyapimpachesina darsakaratna dasari marana varta Vini teevra digbrantiki gurayyanu. Cinema variki yelanti kashtam kaligina mundunde peddadikku daasari ika lerane varta tattukoleka potunnaanu. Ayana aatmaku santi chekooralani bhagavatudini praardhustunnaanu. vari kutumba sabhyulaku naa pragadha saanubhooti - T. Subba ramireddy MP

తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే:

'కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం'.. "దాసరి నారాయణరావు" అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..

చిన్న కధ నుండీ పెద్ద కధ వరకూ, చిన్న బడ్జెట్‌ నుండీ భారీ బడ్జెట్ వరకూ‌, కొత్త నటుల నుండీ అనుభవజ్ఞుల వరకూ, చిన్న స్టార్స్‌ నుండీ పెద్ద స్టార్స్‌ వరకూ అందరితో చిత్రాలను నిర్మించి, వాటిని వెండితెరపై Super Duper Hit చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..

'దర్శకుడు' అంటే ఒకే రకం (రసం) కధా చిత్రాలకే పరిమితం కారాదు, అన్ని రకాల (నవరసాల) కధలను Deal చేయగల సత్తా ఉండాలన్న ధ్యేయంతో, విభిన్న కధలతో కూడిన చిత్రాలను వెండితెరకి అందించిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..

'దర్శకుడు' అంటే కేవలం Lights, Camera, Action & Cut అనే పదాలకే పరిమితమైపోకుండా, ఆ వృత్తికి ఓ Self Respect, Pride & Command లను తెచ్చి, 'దర్శకుడు' అనే పేరుకి ఒక Special Recognition Create చేసి, 'దర్శకుడే' అసలుసిసలైన Hero అనే స్థాయికి తీసుకెళ్ళటమేకాక, 'దర్శకుడు' కూడా నటించగలడు అని నిరూపిస్తూ , పలు Blockbuster చిత్రాలను వెండితెరపై వెలిగించిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..

కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం ఇత్యాది పనులతో పాటు, పరిశ్రమలోని ప్రతివ్యక్తి సమస్యను తన సొంత సమస్యగా భావిస్తూ, తనదైన శైలిలో దానిని పరిష్కరించగలిగే శక్తి (L E A D E R) గా ఎదిగి, అందరి చేత భక్తి, శ్రద్ధలతో 'గురువు గారు' అని పిలిపించుకున్న తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..

'దర్శకుడు' అంటే కేవలం చిత్ర పరిశ్రమతోనే ఆగిపోనఖ్ఖర్లేదూ, జర్నలిజం, రాజకీయాల్లోకీ వెళ్ళొచ్చూ, 'పత్రికాధినేత' 'కేంద్ర మంత్రి' కూడా అయ్యి, ప్రజాసేవ చెయ్యొచ్చూ అని తెలియజెప్పిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..

మీ దర్శకత్వంలో స్వర్గీయ 'నందమూరి తారక రామారావు' గారు నటించిన 'మనుషులంతా ఒక్కటే', 'సర్దార్‌ పాపారాయుడు', 'బొబ్బిలిపులి' చిత్రాలు, అన్నగారి వీరాభిమానులమైన మా గుండెల్లో, మీరు జరిపించిన 'దీపావళి' పండుగలు. మీ దగ్గర Assistant గా పని చేయకపోయినా, నన్ను మీ శిష్యుడిగా, సొంత మనిషిగా ఆదరించారు. మా 'బొమ్మరిల్లు వారి' సంస్థ నిర్మించిన ప్రతి Cinema Function కూ, మీరు Chief Guest గా రావటమే కాక, మీ ఆశీస్సులు అందిస్తూ వచ్చారు..

151 చిత్రాలను దర్శకత్వం వహించే శక్తిసామర్ధ్యాల్ని మీకిచ్చిన ఆ దేవుడు, 100 ఏళ్ళ ఆయుష్షునివ్వకుండా 75 ఏళ్ళకే తన దగ్గరకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవటం వెనుక ఆయనకి ఎన్ని లెక్కలున్నా, ఇంతకు మించిన శక్తిసామర్ధ్యాలతో మిమ్మల్ని మళ్ళీ పుట్టించాలని మనస్పూర్తిగా ఆయన్నే ప్రార్ధిస్తూ..

PS: రాబోయే కాలంలో 151 చిత్రాలకు దర్శకత్వం చేయటం ఒక దుర్లభమైతే, దాంతో పాటు నేను పైన చెప్పిన మిగతా విషయాల్లో కూడా రాణించటమంటే అనితరసాధ్యమే. అందుకే ఆయనే ఆఖరి వ్యక్తీ, శక్తీ..

మీ శిష్యుడు,
వై వి ఎస్ చౌదరి.

- తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. దర్శకుడి స్థాయిని పెంచిన దర్శకరత్న దాసరి మరణం నన్ను ఎంతో బాధిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.
-నటుడు శర్వానంద్

నన్ను నటుడిగా ఆదరించి ఆశీర్వదించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో దాసరి గారు ప్రధములు, అటువంటి గొప్ప మనిషి మరణం ఇండస్గ్రీకి తీరని లోటు. -నటుడు శ్రీవిష్ణు

ఇండస్ట్రీకి మాత్రమే కాదు మా కుటుంబానికి కూడా పెద్ద దిక్కు లాంటి దాసరి గారి మరణం మాకు తీరని లోటు. -మంచు విష్ణు, మంచు మనోజ్

ఒక దర్శకుడిగా, ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు! -గోపీచంద్

తెలుగు సినిమా ఒక గొప్ప వ్యక్తిని, శక్తిని కోల్పోయింది. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన దాసరి నారాయణరావు మన అందరి హృదయాల్లో ఎప్పుడు బ్రతికే ఉంటారు -
వి.వి.వినాయక్

నిర్మాత మేలుకోరే చాలా తక్కువ మంది దర్శకుల్లో దాసరి గారు ఒకరు. ఆయన నుంచి ఇండస్ట్రీ చాలా నేర్చుకొంది, ఇంకా నేర్చుకోవలసింది ఉండగానే ఆయన మరణించడం బాధాకరం. -నిర్మాత అశ్వినిదత్

మా కులపెద్ద కన్నుమూత మాకు తీరని లోటు -క్రిష్ జాగర్లమూడి
మా దర్శకుల పెద్ద, దర్శకుల స్థాయి పెంచిన ప్రతిభాశాలి దాసరి గారి మరణం మా దర్శకులకు మాత్రమే కాక తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద దెబ్బ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను.

గుండె ఆడకపోతే ఏం?... దాసరి గారి సినిమా ఆడుతూనే వుంటుందిగా...థియేటర్స్ లోనో, టి.వీ చానెల్స్ లోనో...
తాతా మనవడు నుంచి నూటయాభైఒక్క సినిమాలున్నాయి... ఆడుతూనే వుంటాయి.

భూమ్మీద సినిమా అనేది లేనప్పుడు దాసరి గారు లేరనాలి... అది జరగదు కదా...

దాసరి గారంటే 74 ఏళ్ళు నిండిన వ్యక్తి కాదు 24 శాఖలు కలిసిన శక్తి..

ఇలాంటి వారికి జయ జయ ద్వానాలు ఉంటాయి .. కానీ జోహార్లు ఉండవు.
దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎక్కడ ఎవరంటున్నా దాసరి గారు వింటారు..
ఏ తెలుగు దర్శకుడికి ఏ గౌరవం దక్కినా అందులో దాసరి గారు ఉంటారు..

పెద్దయన విశ్రాంతి తీసుకుంటున్నారు.....లేరనకండి...వింటారు

స్టార్ డమ్ నటులకు మాత్రమే సొంతం కాదని ప్రూవ్ చేసి, దర్శకుడి పేరు పోస్టర్ పైకి తెచ్చిన మహనీయుడు దాసరి, ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. -దర్శకుడు తేజ

అస్తమించిన తెలుగు శిఖరం -బోయపాటి శీను
దర్శక ద్రోణాచార్యుడు మా దాసరి గారు మా మధ్య లేరనే వార్త నా మనసుని కలచివేసింది.
ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు.
ఆయన చూపిన బాటలో మా దర్శకులం అందరం నడిచి.. ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం.

తెలుగు సినిమా రొమ్ము విరుచుకొని నిలబడేలా చేసిన దార్శనికుడు దాసరి గారు మరణించడం మా దర్శకులందరికీ తీరని లోటు. -దర్శకుడు ఎన్. శంకర్

మాలాంటి యువ నటులందరికీ స్ఫూర్తి అయిన దాసరి గారి మరణం మాకు తీరని లోటు. -విజయ్ దేవరకొండ

ఒక దర్శకుడిగా నాకు దార్శనికుడు, తెలుగు చిత్రసీమకు మార్గ దర్శకుడు దర్శకరత్న దాసరి గారి మరణం మాకు తీరని లోటు. -దర్శకుడు శ్రీవాస్

ఆయన దర్శకదిగ్గజం మాత్రమే కాదు, తెలుగు సినిమాకు మణిహారం, ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఇక లేరనే వార్త మింగుడుపడడం లేదు. -చందు మోండేటి

దాసరి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సాధించిన ఘనత, తెలుగు సినిమాకు తీసుకొచ్చిన గౌరవం చిరస్మరణీయం. -పి.వి.పి

మా దర్శకులందరికీ పెద్ద దిక్కులాంటి దాసరి గారు శారీరికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ మమ్మల్ని నడిపిస్తూనే ఉంటాయి. -దర్శకుడు సంపత్ నంది

ఇండస్ట్రీ ఎదుగుదల కోసం అనునిత్యం ఆరాటపడిన వ్యక్తి దాసరి గారు, అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం బాధాకరం. -నారా రోహిత్

దర్శకరత్న దాసరిగారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు, నిర్మాత క్షేమం కోరే ఆయనలాంటి వ్యక్తి మరణం జీర్ణించుకోవడం కష్టం. -సాయి కొర్రపాటి

శ్రీ దాసరి నారాయణ రావు మరణం పట్ల సంతాపం ప్రకటించిన శ్రీ బండారు దత్తాత్రేయ

మాజీ కేంద్ర మంత్రి, ద‌ర్శ‌క‌ర‌త్న డాక్టర్   దాస‌రి నారాయ‌ణ‌రావు గారి మృతి పట్ల కేంద్ర కార్మిక మరియు ఉపాధికల్పనశాఖామాత్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు సంతాపాన్ని తెలియజేసారు. డాక్టర్ దాసరి నారాయణరావు గారు తనకు ఆత్మీయ మిత్రులని, ఒక సామాన్య కుతూఇంభంలో జన్మించి తన విశేష కృషితో సినీ రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించి సుమారు 150  చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్నారన్నారు. 1972 లో తాత మనవడు సినిమా మొదలుకొని రాములమ్మ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి ప్రజల హృదయాలలో చెరగని తన ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

నేను తీసిన మొదటి సినిమాకి మొదటి అభినందన లభించింది దాసరి గారి నుంచే, అలాంటి వ్యక్తి మరణం నన్ను చాలా బాధించింది. -దర్శకుడు క్రాంతి మాధవ్

తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కులాంటి దాసరి నారాయణరావు గారి మరణం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను. -నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్

పెద్ద దిక్కును కోల్పోయాం: శివాజీ రాజా, న‌రేష్‌
అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని చాలా త్వ‌ర‌గా కోల్కుని మ‌ళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవ‌లే ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇంత‌లోనే దాస‌రి గారి గురించి పెను విషాదం లాంటి వార్త‌ను వినాల్సి వ‌చ్చింది. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. మా టీమ్ అంద‌రికీ పెద్ద దిక్కులా ఉండే వ్య‌క్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సేవ‌లందించిన వ్య‌క్తి. ద‌ర్శ‌క దిగ్గ‌జం లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాం.. `మా` అధ్య‌క్షులు శివాజీ రాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్‌

పెద్ద దిక్కును కోల్పోయాం
ఒక తెలుగు ద‌ర్శ‌కుడిగా అన్ని 151 చిత్రాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించి ద‌ర్శ‌కుడే కెప్టెన్ అని నిరూపించిన వ్య‌క్తి దాసరిగారు. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఏ ఇబ్బంది వ‌చ్చినా ముందు అండ‌గా నిల‌బ‌డే వ్య‌క్తి కూడా ఆయ‌నే. తెలుగు చిత్ర‌సీమకు ఆయ‌న‌ చేసిన కృషి మాట‌ల్లో చెప్ప‌లేం. దాస‌రిగారి ద‌ర్శ‌క‌త్వంలో అహంకారి అనే సినిమాను చేశాను. ఆ సినిమా స‌మ‌యంలో ఆయ‌న‌తో చేసిన జ‌ర్నీ మ‌ర‌చిపోలేను. ఆయ‌న మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. మా కుటుంబ పెద్దను కోల్పోయాం. దాస‌రిగారి కుటుంబంతో కూడా మాకెంతో స‌న్నిహితంగా ఉంటారు. దాస‌రినారాయ‌ణ‌రావుగారి మ‌ర‌ణం మాకు, కుటుంబానికే కాదు, తెలుగు చిత్ర‌సీమ‌కే తీర‌నిలోటు. దాసరి వంటి ద‌ర్శ‌కుడు మ‌ళ్ళీ రాడు, రాలేడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆ దేవ‌ణ్ణి వేడుకుంటున్నాను. - డా.రాజ‌శేఖ‌ర్, జీవిత‌

ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక వ్యక్తిగా నాపై దాసరి గారి ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి మనిషి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది. -నటుడు-దర్శకుడు రవిబాబు

ప్రముఖ తెలుగుచ లన చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చలన చిత్ర రంగానికి చేసిన సేవలు మారువలేనివని విచారం వ్యక్తం చేశారు. దాసరి నారాయణ రావు కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. - రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved