pizza
Celebrities tribute to Geethanjali
You are at idlebrain.com > news today >
Follow Us

29 October, 2019
Hyderabad

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : మా అధ్య‌క్షుడు వీకే న‌రేష్‌
ఈరోజు ఇండ‌స్ట్రీ గీతాంజ‌లిగారిలాంటి ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. అమ్మ‌... విజ‌య‌నిర్మ‌ల‌తోనూ ఆవిడ‌కు మంచి అనుబంధం ఉంది. ఇక న‌టిగా ఆవిడ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌క్షిణాది భాష‌ల్లోనే కాదు.. హిందీలోనూ న‌టించారు. న‌టిగానే కాదు.. వ్య‌క్తిగ‌తంగానూ గీతాంజ‌లిగారు ఎప్పుడూ సంతోషంగా, అంద‌రితో క‌లివిడిగా ఉండేవారు. అలాంటావిడ ఉన్న‌ట్లుండి ఇలా అంద‌రినీ వ‌దిలేసి వెళ్లిపోతార‌ని అనుకోలేదు. ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో అంద‌రికీ ఆమె ఎంతో చేరువ‌గా ఉండేవారు. మంచి, చెడుల్లో భాగ‌మైయ్యేవారు. అలాంటి మంచి మ‌న‌సున్న వ్య‌క్తి మ‌న‌ల్ని విడిచిపెట్టిపోవ‌డం బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి కథానాయికగా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్రను వేశారు గీతాంజలి. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎంతోకాలం గా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు తీరని లోటు అని అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు తెలిపారు. శ్రీమతి గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

గీతాంజలి మృతికి కృష్ణంరాజు సంతాపం
ప్రముఖ నటి గీతాంజలి మృతి పట్ల సుప్రసిద్ధ కథానాయకులు రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు." ఒక సహనటిగా గీతాంజలి నాకు సుపరిచితురాలు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎన్టీ రామారావు గారి " సీతారామ కళ్యాణం " తో పరిచయమైన గీతాంజలి హీరోయిన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ నటిగా వందలాది పాత్రల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపుపొందారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమాలలో కూడా చాలా ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఆమె మరణంతో నేను వ్యక్తిగతంగా ఒక మంచి స్నేహితురాలిని , చిత్ర పరిశ్రమ ఒక మంచి నటిని కోల్పోయినట్లు అయింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" - అన్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved