pizza
Chamanthi producer new film in Nagesh Naradasi director
You are at idlebrain.com > news today >
Follow Us

21 March 2014
Hyderabad

ఇటీవలే 'చామంతి' చిత్రాన్ని నిర్మించిన అభిరుచి గల నిర్మాత టి.చలపతి తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'శ్రీ సత్యనారాయణ స్వామి', బ్యాండ్ బాజా' చిత్రాలకు దర్శకత్వం వహించిన నగేష్ నారదాసి దర్శకత్వంలో నూతన నటీనటులతో ఈ తాజా చిత్రం తెరకెక్కనుంది. బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ లలో ఈ చిత్రం షూటింగ్ ని జరపడానికి నిర్మాత చలపతి సన్నాహాలు చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. చలపతి సినీ ఫిలింస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం ఏ్రపిల్ లో సెట్స్ మీదకు వెళ్ళనుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved