pizza
Chandamama Raave Baanisa song released
న‌వీన్ చంద్ర న‌టించిన చంద‌మామరావే అదిరాదు...వీడుమార‌డు మెద‌టి సాంగ్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 July 2016
Hyderaba
d

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి యూత్ హ‌ర్ట్ ని దొచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రం చందమామ రావే . అది రాదు.. వీడు మార‌డు అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రాన్ని IEF CORPORATION - Italian of the East Films corporation ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా నిర్మాత‌లు కిర‌ణ్ జ‌క్కంశేట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుంది. శ‌ర‌వేగంగా ఫోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. భార‌త‌దేశంలో నే మెట్ట‌మెద‌టి సారిగా ట్విన్స్ ధ‌ర్మ‌-ర‌క్ష ద‌ర్శ‌కులు. ప్రియ‌ల్ గోర్ అనే నూత‌న తార హీరోయిన్ గా చేస్తుంది. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ కి గ్రాండియ‌ర్ విజువ‌ల్స్ తోడ‌యితే ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌ని క‌నువిందు చేస్తుంది. ఈరోజు ఈ చిత్రానికి సంభందించి మెద‌టి సాంగ్ ని విడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన కొన్ని గంట‌ల‌కే వైర‌ల్ గా ట్రెండ్ అవ్వ‌టం యూనిట్ ఆనందంలో వున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. IEF CORPORATION - Italian of the East Films corporation ప్రోడ‌క్ష‌న్ లొ నిర్మిస్తున్న చిత్రం చంద‌మామరావే. న‌వీన్ చంద్ర, ప్రియ‌ల్‌గోర్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్రేమ‌క‌థ కి హీరో,హీరోయిన్స్ కి చాలా ప్రాముఖ్య‌త వుంటుంది. కాబ‌ట్టి ల‌వ్‌బుల్ పెయిర్‌ ని సెల‌క్ట్ చేశాము. మా ద‌ర్శ‌కుడు ధ‌ర్మ‌-ర‌క్ష లు కూడా చాలా క్రీయోటివిటి గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్క‌క్ర‌మాలు చేసుకుంటుంది. తెలుగులో ఇప్ప‌టివ‌రకూ లేన‌ట్టుగా ఫ‌స్ట్ లుక్ సాంగ్ ని మెద‌టిగా విడుద‌ల చేశాము. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌టం ఆనందంగా వుంది. ఫోన్ లిఫ్ట్ చెయ్యంగానే హ‌ల్లో అంటారు అది గ్ర‌హంబ‌ల్ ప్ర‌స్టేష‌న్ పేరు..ఎవ‌రు..వాళ్ళావిడ గురూ..అంద‌మైన అభ‌ద్దం కి ముద్దుపేరు అర్దంలేని నిజం కి కొత్త‌పేరు.. వైన్ ప్ల‌స్ వుమెన్..హౌ ఈజ్ లైఫు ఫైను..ఆడ‌పిల్ల లుక్స్ డౌటే లేదు డ్ర‌గ్స్‌.. అనే లిరిక్స్ తో స్టార్ట‌య్యే సాంగ్స్ యూత్ ని అల‌రిస్తుంది. అతిత్వ‌ర‌లో టీజ‌ర్ ని ఆడియోని విడుద‌ల చేస్తాము. త్వ‌ర‌లో చిత్రాన్ని మీ ముందుకు తీసుకువ‌స్తాము..అని అన్నారు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved