pizza
Chembu China Satyam in post production work
You are at idlebrain.com > news today >
Follow Us

15 June 2015
Hyderabad

ముస్తాబవుతున్న ‘చెంబుచిన సత్యం’

సుమన్‌శెట్టి, ప్రమోదిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చెంబుచిన సత్యం’ ఎల్‌ఐసీ ఏజెంట్ ఉపశీర్షిక. ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్నారు. నామాల రవీంద్రసూరి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్రసూరి మాట్లాడుతూ ‘హారర్ ఎంటర్‌టైనర్ ఇది. చెంబు చినసత్యం ఎలాంటి కల గన్నా నిజజీవితంలో అది వాస్తవంగా మారుతుంటుంది. అలాంటి యువకుడి జీవితంలో ఓ కల ఏ విధమైన అలజడిని రేపింది?ఓ ప్రమాదం బారి నుంచి తన కుటుంబాన్ని అతడు ఏ విధంగా రక్షించుకున్నాడు? అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. కథను నమ్మి ఈ సినిమాను తెరక్కించాను’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘వినోదం,హారర్, ప్రేమ, సెంటిమెంట్ మేళవింపుతో రూపొందిన చిత్రమిది హారర్, కామెడీ జోనర్‌లో రూపొందిన చిత్రాలు ఈ మధ్యకాలంలో చక్కటి విజయాల్ని అందుకుంటున్నాయి.ఆ జాబితాలో ఈ సినిమా చేరుతుందనే నమ్మకముంది’ అన్నారు. నా ఆలోచనలకు అనుగుణంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు.

వాసు ఇంటూరి, శరశ్చంద్ర, మాస్టర్ ఆద్యశ్రీమహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సంగీతం: విజయ్ కురాకుల, పాటలు: మౌనశ్రీ మల్లిక్, నిర్మాణ నిర్వహణ: శ్రీహర్ష ఆలూరి, నిర్మాత: ఆలూరి సాంబశివరావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నామాల రవీంద్రసూరి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved