pizza
Chiru Godavalu on 20 November
‘చిరు గొడవలు’ నంబర్ 20న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

08 November 2015
Hyderabad

 

ప్ప్రతిష్ఠాత్మక అన్నపూర్ణ ఫిలిం స్కూల్ విద్యార్థులు రూపొందించిన ‘చిరు గొడవలు’ నంబర్ 20న విడుదల
రోహిత్, భావిక, సిద్ధార్థ్, రాగ, నాగేంద్ర, హారిక, యోధ, గీతాంజలి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘చిరుగొడవలు’. 11 ప్లస్ మూవీస్ బ్యానర్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ ఫిలిం స్కూల్ విద్యార్థులు ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాల మీద ఆసక్తితో అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడు త్రికరణ్ రెడ్డి దర్శకుడు కావాలనే ఆలోచనతో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సలహాపై అన్నపూర్ణ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో దర్శకత్వశాఖలో డిప్లొమా పూర్తి చేశారు. త్రికరణ్ రెడ్డి దర్శకత్వంలో తొలి చిత్రంగా రూపొందిన ‘చిరుగొడవలు’ చిత్రాన్ని జైపాల్ ఏలేటి నిర్మించారు. ఈ సినిమాలో అందరూ నూతన నటీనటులే నటించారు. ఇంటర్మీడియెట్ వరకు ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు మధ్య జరిగే కథ ఇది. నారాయణ ఎన్నారై. అమెరికన్ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వారికి ఇద్దరమ్మాయిలు పుడతారు. పిల్లలు చిన్నతనంలోనే భార్య చనిపోవడంతో నారాయణ తన ఇద్దరి పిల్లలైన కత్రిన, ప్రీతిలతో ఇండియా వచ్చేస్తాడు. పెద్దమ్మాయి కత్రిన తన ఇష్టానుసారం నడుచుకుంటుంటే, చిన్నమ్మాయి ప్రీతి నలుగురు ఇష్టాలను తెలుసుకుని ప్రవర్తిస్తుంటుంది. నారాయణ తన ఇద్దరి కుమార్తెలను ఎలా పెంచాడనేదే సినిమా.
గీతా పూనిక్ ఈ చిత్రానికి సంగీతం అందించిన ఈ చిత్రానికి కళ్యాణ్ సమి సినిమాటోగ్రఫీ అందించారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలుకూడా అందుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేస్తున్నారు.
రోహిత్, భావిక, సిద్ధార్థ్, రాగ, నాగేంద్ర, హారిక, యోధ, గీతాంజలి, శ్రావణ్ రాఘవ, సుదర్శన్ రెడ్డి, సంధ్య జనక్, బీను మల్హోత్రా, బేబి సమీర్ణ, బేబి హన్సిక నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమీ, సంగీతం: గీతా పూనిక్, నిర్మాత: జైపాల్ ఏలేటి, దర్శకత్వం: త్రికరణ్ రెడ్డి.

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved