లవ్లీ రాక్‌స్టార్ ఆది హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమా ఆగస్ట్19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ - ''ఆది, వీరభద్రమ్‌ల కాంబినేషన్లో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మా 'చుట్టాలబ్బాయి' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా పాటలకు,థియేట్రికల్ ట్రైలర్ కు అన్నిచోట్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. 'ప్రేమకావాలి', 'లవ్లీ' చిత్రాల తర్వాత ఆదికి 'చుట్టాలబ్బాయి' మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. అలాగే 'అహనా పెళ్ళంట', 'పూలరంగడు' తర్వాత వీరభద్రమ్ రూపొందిస్తున్న మరో సూపర్‌హిట్ మూవీ ఇది. ఈ చిత్రం సూపర్‌హిట్ అయి మా బేనర్స్‌కి కూడా చాలా మంచి పేరు తెస్తుంది'' అన్నారు.