pizza
Cinema Choopista Maava audio success meet on 5 August
You are at idlebrain.com > news today >
Follow Us

16 July 2015
Hyderabad

ఆగస్టు 5న ‘సినిమా చూపిస్త మావ’ సంగీత విజయోత్సవం!!
-మధుర ఆడియో అధినేత ‘మధుర’ శ్రీధర్‌


‘యువ సంగీత సంచలనం’ శేఖర్‌చంద్ర సంగీత సారధ్యంలో రూపొంది.. ‘మధుర ఆడియో’ ద్వారా జులై 7న విడుదలైన ‘సినిమా చూపిస్త మావ’ ఆడియోకు అనూహ్యమైన స్పందన లభిస్తోందని చెబుతున్నారు ‘మధుర ఆడియో’ అధినేత ‘మధుర శ్రీధర్‌’. ఎఫ్‌.ఎంలో ఒకటికి పదిసార్లు ప్లే అవుతున్న ఈ చిత్రంలోని పాటలు రింగ్‌టోన్స్‌గానూ పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్‌ అవుతుండడం తమకు చాలా సంతోషాన్నిస్తోందని శ్రీధర్‌ అంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘మధుర ఆడియో’ ఆధ్వర్యంలో ఆగస్టు 5న ఈ చిత్రం సంగీత విజయోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్‌`అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం ఫస్ట్‌ కాపీ ఈవారంలో సిద్ధం కానుంది. త్వరలోనే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి.. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌-ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో.. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)-రూపేష్‌ డి.గోహిల్‌-జి.సునీత నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీత దర్శకుడు. భాస్కరభట్ల రవికుమార్‌-వనమాలి-కృష్ణచైతన్య-ప్రసన్నకుమార్‌ సమకూర్చిన సాహిత్యానికి రమ్య బెహరా-లిప్సిక-అనుదీప్‌-దిన్‌కర్‌-సింహా-లక్కీ రాజుతోపాటు సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర గాత్రమందించారు.

రావురమేష్‌, బ్రహ్మానందం, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయిశ్రీరామ్‌-దాశరధి శివేంద్ర, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌(గోపి)-రూపేష్‌ డి.గోహిల్‌-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన!!




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved