pizza
My Name is Raju from Chavu kaburu challaga out now
అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్, బ‌న్నీవాసు యంగ్ హీరో కార్తికేయ "చావు క‌బురు చ‌ల్ల‌గా " చిత్రం నుంచి మొద‌టి పాట మై నేమ్ ఈజ్ రాజు విడుద‌ల‌‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

05 February -2021
Hyderabad
The makers of Chavu kaburu challaga have launched the first song titled My name is raju from the audio album today. This character intro single has a catchy tune and grows on its listeners.

Jakes Bejoy composed the song and indian idlo winner revanth crooned it. karunakar adigarla penned some dynamic lyrics.

The song has garnered a positive response already and it is expected to take social media by a storm in the days to follow. The album is getting released by well know music label Adity Music

The film has young hero karthikeya, Bubbly beauty lavanya tripati in the lead roles.

Chaavu Kaburu Challaga is being directed by Koushik Pegallapati and produced by Bunny Vas. Alread the makers of this movie have announced that this rustic romantic entertainer will be hitting the big screens across the globe on 19th of March.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాను మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన‌ మై నేమ్ రాజు అంటూ సాగే బ‌స్తీ బాలారాజుగా హీరో కార్తికేయ ఇంట్రో సాంగ్ తాజాగా విడుద‌లైంది. ఈ సాంగ్ ని రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాలో బ‌స్తీబాలరాజు అనే క్యారెక్ట‌ర్ లో కార్తికేయ లుక్స్ కి, నేప‌థ్యానికీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా సినీ అభిమానుల్ని కచ్ఛితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్రం బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నీ వాసు మాట్లాడుతూ

చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమాను అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్ల‌పాటి సిద్ధం చేస్తున్నారు.
ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ బ‌స్తీబాల‌రాజు క్యారెక్ట‌ర్ వీడియో,‌ టీజ‌ర్ గ్లింప్స్ ద్వారా ఆ విష‌యం స్ప‌ష్టం అవుతుంది. ఇప్పుడు వ‌చ్చిన ఫ‌స్ట్ సింగ్ సాంగ్ మై నేమ్ ఈజ్ రాజు కూడా సినీ అభిమానుల్ని అల‌రిస్తోంద‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడు జేక్స్ బిజాయ్ ఇటు పాట‌లుకి అద్భుత‌మైన ట్యూన్స్ ఇస్తూనే అటు నేప‌థ్య సంగీతానికి పెద్ద పీఠ వేస్తూ చ‌క్క‌టి అవుట్ పుట్ ఇస్తున్నారు. జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో "100% ల‌వ్", "భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌", " గీతగోవిందం", "ప్ర‌తిరోజు పండ‌గే" చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. ఆ లెగ‌సినీ స‌క్సెస్ ఫుల్ గా చావుక‌బురుచ‌ల్ల‌గా ముందుకు తీసుకువెళుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని అన్నారు.

నటీనటులు..

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం..

స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత - బ‌న్నీ వాసు
దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌- స‌త్య జి
ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి

 

 

 

 

 

 

 

 

 

    
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved