pizza
Big Release for Vidyut Jammwal's Commando 2 on March 3rd
మార్చ్ 3 న తెలుగు లో భారీ యాక్షన్ చిత్రం కమెండో 2 విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

22 January 2017
Hyderaba
d

విధ్యుత్ జాంవాల్ హీరో గా నటించిన ఆక్షన్ చిత్రం "కమెండో : వన్ మాన్ ఆర్మీ" ఎంతటి ఘానా విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ఈ చిత్రానికి ఇప్పుడు ఒక సీక్వెల్ వస్తోంది. ఈ చిత్రానికి "కమెండో 2" అనే పేరు ని ఖరారు చేసారు. బ్లాక్ మనీ నేపధ్యం లో సాగే ఈ భారీ యాక్షన్ చిత్రానికి దేవేన్ భోజాని దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని మార్చ్ 3 న విడుదల చేయనున్నట్లు నిర్మాత విపుల్ షా తెలిపారు. "కమెండో 2 చిత్రాన్ని హిందీ తో పటు తెలుగు లో కూడా భారీ స్థాయి లో విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం లో ని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. తెలుగు లో మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆదా శర్మ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది", అని విపుల్ షా తెలిపారు.

రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, జయంతిలాల్ గాడా మరియు సన్ షైన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved