pizza
That's how you score a 'HIT' in Corona times
కరోనాపై పోరులో 'హిట్' అవ్వాలంటే...
You are at idlebrain.com > news today >
Follow Us

15 April 2020
Hyderabad



Each one of us wants to avoid stepping out in times like this. Much as we try to stay indoors, it becomes inevitable to go out at times, be it for medicines or other essentials. What are you supposed to do to take care of yourself when you go out?

'HIT' director Sailesh Kolanu has made a special explanatory video to create awareness in this regard. The video has been much-viewed on his Instagram handle and it has come in praise from all quarters. As is known, Sailesh recently made a debut with the box-office hit film 'HIT: The First Case', the crime thriller.

Speaking about the steps we need to adhere to in order to keep COVID-19 at bay, Sailesh Kolanu says, "With the lockdown being extended till May 3, inconvenience is unavoidable. It's important for us to be aware of how to protect ourselves when we step out to buy essentials or on urgent work. Besides being a filmmaker, I come from a healthcare background. I have knowledge of disease control. That's why I have made the video to spread awareness."

 

లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లకూడదని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయట అడుగుపెట్టక తప్పదు. మందుల కోసమో, నిత్యావసర సరుకుల కోసమో బయటకు వెళ్లవలసిన పరిస్థితి. అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని యువ దర్శకుడు శైలేష్ కొలను వీడియో చేసి మరీ చూపించారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ సినిమా 'హిట్: ది ఫస్ట్ కేస్'తో దర్శకుడిగా శైలేష్ పరిచయం అయ్యారు. కరోనాపై పోరులో 'హిట్' అవ్వాలంటే ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తే మంచిదని వీడియో చూసినవారు ప్రశంసిస్తున్నారు.

కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ తరుణంలో, మహమ్మారి మన దరికి చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శైలేష్ కొలను మాట్లాడుతూ "లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకూ పొడిగించడంతో మనకు ఇంకొన్ని రోజులు ఇబ్బంది తప్పదు. ఈ సమయంలో సరుకులు, మందులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? అనేది మనమంతా తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. నేను దర్శకుడు కావడానికి ముందు, హెల్త్ కేర్ ప్రాక్టీషనర్‌ని. డిసీజ్ కంట్రోల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల... నేను బయటకు వెళుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది చూపిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశా" అని అన్నారు.

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved