pizza
Daksha Nagarkar about Hushaaru
గ్యాప్‌ తీసుకోవడానికి కారణమదే - దక్షా నగార్కర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

3 December 2018
Hyderaba
d

బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్‌ దక్షా నగార్కర్‌ మాట్లాడుతూ ''నేను పుట్టింది ముంబైలో.. పంచ్‌గనిలో పెరిగాను. మళ్లీ ముంబై వచ్చాను. ఓ ఏడాది పాటు హైదరాబాద్‌లో ఉన్నాను. రెండేళ్లు బెంగళూరులో ఉన్నాను. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాను. మా అమ్మగారు కాస్మోటిక్‌ కంపెనీలో పనిచేస్తారు. ఆమెతో పాటు నేను ట్రావెల్‌ చేస్తుండటం వల్ల ఇన్ని స్టేట్స్‌లో తిరిగాను. ఇక సినిమా విషయానికి వస్తే హోమ్లీగా.. నెమ్మదైన మనస్తత్వంలో ఉండే అమ్మాయి పాత్రలో నటించాను. తేజస్‌ కంచెర్ల నా జోడిగా నటించారు. నలుగురు స్నేహితుల కథ. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌, డ్రామా, ఎమోషన్స్‌ అన్నీ ఉన్నాయి. కాబట్టి సినిమాను అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. నా తొలి చిత్రం తేజగారితో 'హోరా హోరీ' చేశాను. ఇది నా రెండో సినిమా. తొలి సినిమా పూర్తి కాగానే గ్యాప్‌ తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో బి.బి.ఎ పూర్తి చేశాను. మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించాను. డైరెక్టర్‌ శ్రీహర్ష ఎక్కడో నా ఫోటోలను చూసి బెక్కెం వేణుగోపాల్‌గారికి 'మనం అనుకున్న క్యారెక్టర్‌కి ఈ అమ్మాయి అయితే బావుంటుంది' అని చెప్పడంతో బెక్కెంగారు నాకు ఫోన్‌ చేశారు. హైదరాబాద్‌ వచ్చి స్క్రిప్ట్‌ విన్నాను. నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నాను. నాకు కమర్షియల్‌ సినిమాలంటే ఇష్టం. కాబట్టి తెలుగు సినిమాలను ఎక్కువగా ఇష్టపడతాను'' అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved