pizza
Deal With Dhanalakshmi in songs recording
పాటల రికార్డింగ్ లో 'డీల్ విత్ ధనలక్మి'
You are at idlebrain.com > news today >
Follow Us

04 March 2016
Hyderaba
d

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో శ్రీ గురు క్రియేషన్స్, విశ్వక్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'డీల్ విత్ ధనలక్ష్మి'. ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నాయి. యువ కథానాయకుడు మానస్ హీరోగా వెంకట్ ప్రసాద్ (బాబీ) దర్శకత్వంలో ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహచలం నిర్మిస్తున్న ఈ చిత్రానికి డా. జోశ్యభట్ల సంగీతదర్శకుడు. బాల భాస్కర్ రాసిన పాటను హేమచంద్ర పాడగా ఎస్.ఎ. మీడియా ల్యాబ్ లో రికార్డ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రసాద్ (బాబి) మాట్లాడుతూ - ''ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. వినోద ప్రధానంగా సాగే చిత్రం. పది మంది కోసం పాటు పడే యువకుడి కథ ఇది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేధించడానికి ఎంతదాకా అయినా వెళతాడతను. హ్యూమన్ రిలేషన్స్ కి వేల్యూ ఇచ్చే ఈ పాత్ర అందరికీ నచ్చే విధంగా ఉంటుంది'' అని చెప్పారు.

నిర్మాతలు ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహచలం మాట్లాడుతూ - ''ఈ నెల 10 నుంచి 30 వరకూ రాజమండ్రి, తాపేశ్వరం, సిద్దాంతం పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ జరుపుతాం. ఏప్రిల్ 7 నుంచి 25 వరకూ హైదరాబాద్ లో జరిపే రెండో షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు.

మానస్ మాట్లాడుతూ - ''ఈ చిత్రకథ, స్ర్కీన్ ప్లే చాలా డిషరెంట్ గా ఉంటాయి. నా పాత్ర కూడా బాగుంటుంది'' అన్నారు.

పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్ రెడ్డి, సత్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో 'జబర్దస్త్' కమెడియన్స్ తో పాటు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జోశ్యభట్ల, కెమెరా: ఎ.వి. శ్రీనివాస్ (బాబు), పాటలు: బాల భాస్కర్, శ్రీరామ్ తపస్వి, బాబీ, నిర్మాతలు: ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహచలం, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వెంకట్ ప్రసాద్ (బాబీ).


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved