pizza
Deepthi Shetty about Sriramudinta Srikrishnudanta
శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' లో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది - హీరోయిన్ దీప్తి శెట్టి
You are at idlebrain.com > news today >
Follow Us

23 May 2017
Hyderabad

ఈ సినిమాతో నూతన తారలు శేఖర్ వర్మ, దీప్తి శెట్టి హీరోహీరోయిన్లుగా గ్రాయత్రి ప్రొడక్షన్స్ పతాకం పై కె.ఎస్.రావు నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు నరేశ్ పెంట తెరకెక్కించిన సినిమా 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'. మే 26న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ దీప్తి తాజాగా పాత్రికేయులతో ముచ్చటించారు. ప్రిమియర్ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిచడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడు నరేశ్ పెంట ఈ సినిమాను మనసుని హత్తుకునే రీతిన తెరకెక్కించారని, ఈ సినిమా చూసినంత సేపు పల్లెల్లో తిరిగిన అనుభవం ప్రేక్షకులకి తప్పక వస్తుందని చెప్పారు దీప్తి. అలానే ఈ సినిమాతో ఓ పల్లెటూరు అమ్మాయిలా కనిపించబోతున్నానని, స్వతహాగ కన్నడ అయినప్పటికీ స్వచ్ఛమైన తెలుగమ్మాయిలా నటించడం చాలా ఆనందాన్నిచ్చందని చెప్పారు. ఇక షూటింగ్ సమయంలో హీరో శేఖర్ దగ్గర తెలుగు భాష నేర్చుకున్నానని ఇప్పుడు తెలుగు బాగానే మాట్లాడుతున్నట్లుగా తెలిపారు. 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' వంటి కుటుంబ కథా చిత్రంతో జరగడం తన కెరీర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీప్తి. అలానే తెలుగు ఫ్యామిలీల్లో ఉండే ఎమోషన్స్ ని మనసుకి హత్తుకునే రీతిన ఈ సినిమా ఉండబోతుందని, అలానే ఈ సినిమా తన క్యారెక్టర్ ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుందని, మే 26న విడుదల కాబోతున్న ఈ సినిమాను చూడాల్సిందిగా దీప్తి కోరారు. ఈ చిత్రానికి రచన-సంగీతం-దర్శకత్వం నరేశ్ పెంట. నిర్మాత : కే.యస్.రావు, సినిమాటోగ్రఫి : కూనపరెడ్డి జయకృష్ణ, నిర్మాణ నిర్వహణ : కే.ఆర్. ప్రశాంత్.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved