pizza
Devi Sri Prasad in full Swing
సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు కోసం ఫుల్ స్వింగ్ లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్
You are at idlebrain.com > news today >
Follow Us

17 December 2019
Hyderabad

The released singles from the album of Superstar Mahesh Babu's Sarileru Neekevvaru received stupendous response. The third single 'He's Soo Cute' is out recently and is an instant chartbuster. Superstar fans are all thrilled with the songs composed by Devi Sri Prasad. DSP during the film's launched promised that Superstar fans will not be disappointed. As promised, he delivered some of the best tunes in the recent times. Devi even stepped out with an interesting update about the fourth single that will be unveiled next Monday

MassMB Mondays turned out to be SuperHit Mondays after the music festival of Sarileru Neekevvaru started. Thousands of videos are surfaced on Tiktok already and they are now viral across the internet. Devi Sri Prasad revealed that the fourth song will be a class one and he is spotted working with a a Huge Orchestra from Europe. He recorded the song along with an amazing Orchestra using a bunch of foreign Musicians. Directed by Anil Ravipudi, Sarileru Neekevvaru is announced for January 11th 2020 release during Sankranthi 2020.

సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు కోసం ఫుల్ స్వింగ్ లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు నుండి విడుదలైన పాటలన్నీ శ్రోతల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఇటీవలే రొమాంటిక్ మెలోడీ గా విడుదలైన మూడో పాట 'హీ ఈజ్ సో క్యూట్' ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సూపర్ స్టార్ అభిమానులు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకి ఫిదా అయ్యారు. ఈ చిత్ర ప్రారంభ సమయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించేలా సంగీతాన్ని అందిస్తానని చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ సరిలేరు నీకెవ్వరు కోసం ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బెస్ట్ ట్యున్స్ ను కంపోజ్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఇక రాబోయే సోమవారం (డిసెంబర్ 23) న విడుదల కానున్న ఫోర్త్ సింగిల్ గురించి దేవి ఇంటరెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు.

సరిలేరు నీకెవ్వరు మ్యూజికల్ ఫెస్టివల్ మొదలయినప్పటి నుండి ప్రతి సోమవారం ఒక సూపర్ హిట్ సాంగ్ తో MaSSMB మండేస్, సూపర్ హిట్ మండేస్ గా మారిపోయి ప్రేక్షకులు, అభిమానులు ప్రతి సోమవారం రాబోయే కొత్త పాట కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఈ పాటలకి సంబంధించి కొన్ని వేల టిక్ టాక్ వీడియోలు ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ నాలుగో పాట క్లాస్ సాంగ్ గా ఉండనుందని రివీల్ చేశారు. ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకి, ప్రేక్షకులకి ఫీస్ట్ గా జనవరి 11, 2020 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved