pizza
Dia Mirza in Wild Dog
నాగార్జున 'వైల్డ్ డాగ్‌' మూవీలో దియా మీర్జా
You are at idlebrain.com > news today >
Follow Us

24 January 2020
Hyderabad

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రను బాలీవుడ్ పాపులర్ తార దియా మీర్జా చేస్తుండటం విశేషం. ఆమెది రెగ్యులర్ క్యారెక్టర్ కాదనీ, పర్ఫార్మెన్సుకు బాగా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రనీ, ఆ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తున్న నమ్మకంతో ఆమెను తీసుకున్నామనీ చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అతి త్వరలోనే దియా మీర్జా పాల్గొనే సన్నివేశాలు మొదలు కానున్నాయి.

ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటిస్తున్నారనీ, ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందనీ చిత్ర బృందం తెలిపింది.

కింగ్ నాగార్జున హీరోగా, దియా మీర్జా ఒక కీలక పాత్రలో న‌టిస్తోన్న ఈ చిత్రానికి...
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సాల్మోన్‌
నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స‌హ నిర్మాత‌లు: ఎన్‌.ఎమ్‌. పాషా, జ‌గ‌న్ మోహ‌న్ వంచ‌
సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌: డేవిడ్ ఇస్మాలోన్
డైలాగ్స్‌: కిర‌ణ్ కుమార్
ఎడిట‌ర్‌: శ‌్ర‌వ‌ణ్ కటికనేని
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌: స‌తీష్‌, ప్ర‌శాంత్‌
ఆర్ట్‌: ముర‌ళి ఎస్‌.వి.
వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్ టి.
కాస్ట్యూమ్స్‌: అశ్వంత్ బైరి
స్టంట్ కో ఆర్టినేట‌ర్‌: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved