pizza
Directors turn actors for Sundeep Kishan's movie
సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు
You are at idlebrain.com > news today >
Follow Us

19 June 2019
Hyderabad

'Ninu Veedani Needanu Nene', an emotional horror entertainer, stars Sundeep Kishan in the lead role. The hero is producing this novel movie on Venkatadri Talkies (Production No. 1) in association with V Studios and Vista Dream Merchants. Directed by Caarthick Raaju, Anya Singh is the female lead.

The makers are glad that the film will feature guest roles by some well-known names. Director Vi Anand, Kollywood filmmaker Karthick Naren, and actress Malavika Nair will be seen in guest roles. They are all very good friends of Sundeep Kishan.

Sundeep's 'Tiger' was directed by Vi Anand, who is currently working on Mass Maharaja Ravi Teja's 'Disco Raja'. As for Karthick Naren, he is the director of one of the recent Tamil movies done by Sundeep. His 'D-16' is a well-known movie. The duo came on board to act in 'Ninu Veedani Needanu Nene' as soon as Sundeep requested them.

Currently, the film's post-production works are in full swing. High technical values are the film's forte. Producers Daya Pannem, Sundeep Kishan and Viji Subramanian are producing this AK Entertainments' Anil Sunkara presentation.

The film's recently-released title track, penned by celeb stylist Neeraja Kona, has received an amazing response. A fun-filled, energetic song, titled 'Excuse Me Rakshasi', rendered by Siddharth, will be unveiled soon.

"The film has come out really well. Sundeep has done a great job. I was excited while doing RR," SS Thaman recent tweeted out.

Once done with all the post-production works and Censor formalities, the entertainer will hit the screens on July 12.

Posani Krishna Murali, Murali Sharma, Vennela Kishore, Poornima Bhagyaraj and Pragathi are part of the cast.

Music is by SS Thaman, cinematography is by Pramod Varma, editing is by Chota K Prasad, and art direction is by Videsh. Executive Producers are Siva Cherry, Seetharam and Kirubakaran. PRO: Naidu - Phani (Beyond Media)

సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్ నటించారు. వీరు ముగ్గురు సందీప్ కిష‌న్‌కి మంచి మిత్రులు.

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'టైగర్' చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, సందీప్ కిషన్ నటించిన ఓ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ తమిళ సినిమా తెలుగులో 'డి 16' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. వీరిద్దరూ సందీప్ కిషన్ అడగ్గానే ఆయన కోసం అతిథి పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రీరికార్డింగ్ చేస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాలో తొలి పాట, ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన రాసిన టైటిల్ సాంగ్ 'నిను వీడని నీడను నేనే' విడుదలైంది. ఈ పాటకు శ్రోతల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. అలాగే, ఈ సినిమాలో ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్ 'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి ...'ను హీరో సిద్ధార్థ్ పాడారు. త్వరలో ఈ పాట విడుదల కానుంది. "సినిమా బాగా వచ్చింది. సందీప్ కిషన్ అద్భుతంగా చేశాడు. రీ రికార్డింగ్ చేస్తూ ఎగ్జయిటయ్యను" అని ఎస్.ఎస్. తమన్ ట్వీట్ చేశారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved