pizza
Edida Nageswara Rao is no more
You are at idlebrain.com > news today >
Follow Us

04 October 2015
Hyderabad

Producer of several classics, Edida Nageswara Rao (81) is no more. He was born on 24 April 1934. He has started the production house Poornodaya Movie Creations and made Sirisiri Muvva as his first movie in the direction of K Viswanath. He went on to make several classics like Sankarabharanam, Seethakoka Chiluka, Sagara Sangamam, Sitara, Swayam Krushi etc. Most of his films were directed by K Viswanath. Sankarabharam which was released to empty houses went on to become a huge blockbuster despite having artistic content. This movie has also won national award and was exhibited at several film festivals. May his soul rest in peace.

ఏడిద నాగేశ్వ‌ర‌రావు క‌న్నుమూత‌

తెలుగు చ‌ల‌న‌చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు న‌వ‌ర‌త్నాల్లాంటి సినిమాల‌ను అందించిన నిర్మాత ఏడిద నాగేశ్వ‌ర‌రావు క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అస్వ‌స్థ‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆదివారం ప్రైవేటు ఆసుప‌త్రిలోతుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు 81 ఏళ్ళు. భార్య జ‌య‌ల‌క్ష్మి, ఒక కుమార్తె, ముగ్గురు కొడుకులు ఉన్నారు. 1934 ఏప్రిల్ 24న కొత్త‌పేట‌లో పుట్టారు ఏడిద నాగేశ్వ‌ర‌రావు. లోభి అనే నాట‌కంలో అమ్మాయి వేషం వేసి నాట‌కాల్లోకి అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత ఆత్రేయ రాసిన ప‌లు నాట‌కాల‌ను ప్ర‌ద‌ర్శించి ప‌లు అవార్డుల‌ను తెచ్చుకున్నారు. అన్న‌పూర్ణ సినిమాలో వేషం ఇస్తాన‌ని మ‌ద్రాసుకు ఏడిద‌ను పిలిపించారు వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్‌. అది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో త‌న నాట‌కాల మిత్రుడు హ‌ర‌నాథ్‌ను క‌లుసుకుని అత‌ని గ‌దిలో ఉన్నారు ఏడిద‌. ఆ త‌ర్వాత డ‌బ్బింగ్ క‌ళాకారుడిగా, సినిమాల్లో ఓ మోస్త‌రు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లకు స‌రిపోయే న‌టుడిగా కొన‌సాగారు. ఓ సంద‌ర్భంలో వ‌స్త్రాల ఎక్స్ పోర్టు బిజినెస్ కూడా చేశారు. కానీ అది అప్పుల్లోకి నెట్ట‌డంతోమానుకున్నారు. ముందు త‌న మిత్రులు 19 మందితో క‌లిసి సిరిసిరిమువ్వ సినిమాను రూపొందించారు. ఆ సినిమాకు ఆయ‌న ఎగ్జిక్యూటివ్ నిర్మాత మాత్ర‌మే.
ఆ త‌ర్వాత త‌న తోడ‌ల్లుడు, బావ‌మ‌రుదుల‌తో క‌లిసి ఓ సినిమాను రూపొందించారు. అదే తాయార‌మ్మ బంగార‌య్య‌. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాను పూర్ణోద‌య ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కించారు ఆయ‌న‌. ఆ త‌ర్వాత శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని కూడా పూర్ణోదయ ఆర్ట్ క్రియేష‌న్స్ పై తెర‌కెక్కించారు. మూడో సినిమా నుంచి పూర్ణోద‌య ఆర్ట్ ను కాస్తా పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ గా మార్చారు. పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ లో సీతాకోక చిలుక తొలి సినిమా. ఆ త‌ర్వాత సితార‌, స్వాతి ముత్యం, స్వ‌యంకృషి, స్వ‌ర‌క‌ల్ప‌న‌, ఆప‌ద్బాంధ‌వుడు చిత్రాల‌ను తెర‌కెక్కించారు. త‌న కుమారుడు ఏడిద శ్రీరామ్ ను హీరోగా పెట్టి తీసిన స‌ర్వ‌క‌ల్ప‌న త‌ప్ప మిగిలిన సినిమాల‌న్నీ ఏడిద నాగేశ్వ‌ర‌రావుకు మంచి పేరు, డ‌బ్బును తెచ్చి పెట్టిన సినిమాలే. ఆయ‌న ప్ర‌తిసినిమా ఓ ఆణిముత్యం. అందుకే జాతీయ అవార్డుల్ని, నంది అవార్డుల్ని సొంతం చేసుకోగ‌లిగాయి. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పూర్ణోద‌య సంస్థ తెర‌కెక్కించింది ప‌ది సినిమాలే అయినా అవి ప‌దికాలాల‌పాటు నిలిచిపోయే సినిమాలు. ఏడిద నాగేశ్వ‌ర‌రావు అంతిమ యాత్ర సోమ‌వారం హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved