pizza
AMAZON PRIME VIDEO UNVEILS THE POSTER OF TELUGU FILM ‘EK MINI KATHA’; GLOBALLY PREMIERES ON 27TH MAY
మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంతోష్ శోభన్, యువీ కాన్సెప్ట్స్ చిత్రం ‘ఏక్ మినీ కథ’ విడుదల..
You are at idlebrain.com > news today >
Follow Us

20 May 2021
Hyderabad

Amazon Prime Video unveils the poster of Ek Mini Katha, a Telugu film that brings along a light-hearted, romantic tale with an underlining theme of a social message. Starring Santosh Sobhan and Kavya Thapar in the lead, it deals with a rather unusual subject that a common man faces.

Actor Santosh Sobhan, about his character, remarks, “It was an absolute riot while filming this movie! The writing, the direction was so spot on, that playing the character came easily to me. The fact that this topic is so ingrained in reality that the finer nuances of the character was not very difficult to portray. The film is an absolute delight to watch, and I can’t wait for audiences to watch it either.”

The film is directed by Karthik Rapolu and written by Venkatadri Express fame Merlapaka Gandhi and premieres on 27th May 2021 on Amazon Prime Video.

బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు.. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు.. అందుకే మా సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ ఈమధ్య అధికారికంగా ప్రకటించారు ఏక్ మినీ కథ చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లోనే ఏక్ మినీ కథ సినిమా నిర్మాణం పూర్తైంది.

ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ఏక్ మినీ కథ యూనిట్.

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తీక్ రాపోలు
నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య
PRO: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్





Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved