pizza
EROS International takes over Saakshyam
"సాక్ష్యం" వరల్డ్ వైడ్ రైట్స్ సొంతం చేసుకొన్న ఎరోస్ సంస్థ
You are at idlebrain.com > news today >
Follow Us

21 July 2018
Hyderabad

All the rights related to ‘Saakshyam’ movie have been bought by Bollywood’s leading production house, EROS International for a whopping amount.

Saakshyam is made with a unique concept on Nature’s five elements. This content in the film has impressed EROS and they did not give a second thought to make the deal.

We also hear that producer Abhishek Nama maintains close relations with many production houses of Bollywood and this time he is getting associated with EROS with ‘Saakshyam.’

Releasing on July 27th, the film has Bellamkonda Sai Sreenivas and Pooja Hegde in the lead cast. It’s a Sriwass directorial and Harshavardhan Rameshwar musical.

So ‘Saakshyam’ is going to witness a grand release.

"సాక్ష్యం" వరల్డ్ వైడ్ రైట్స్ సొంతం చేసుకొన్న ఎరోస్ సంస్థ

బెల్లంకొండ సాయిశ్రీనివాస్-పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన "సాక్ష్యం" చిత్రం ఈనెల జూలై 27న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ "ఎరోస్" సొంతం చేసుకొంది. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగానే కాక పలు ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఎరోస్ సంస్థ ఇప్పుడు "సాక్ష్యం" హక్కులను కూడా సొంతం చేసుకోవడం విశేషం.

అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చేసిన రిస్కీ స్తంట్స్, పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్, జగపతిబాబు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. శ్రీవాస్ చాలా డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో "సాక్ష్యం" ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుండడం విశేషం.



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved