pizza
Fans gift world record to NBK
బాలయ్య కి ప్రపంచ రికార్డ్ ని బహుమతిగా అందించిన అభిమానులు
You are at idlebrain.com > news today >
 
Follow Us

20 June
Hyderabad



బాలయ్య కి ప్రపంచ రికార్డ్ ని బహుమతిగా అందించిన అభిమానులు

బాలయ్య అభిమానుల సమాజికబాధ్యతకి ప్రపంచ రికార్డు సొంతం

ప్రపంచ రికార్డు సాధించిన బాలయ్య 60వ జన్మదిన వేడుకలు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జూన్10 బాలకృష్ణ గారి 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్లోబల్ నందమూరి అభిమానులు మంచి ఆలోచనతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు..

ప్రతి సంవత్సరంల వేలాది అభిమానుల మధ్య జరిగే వేడుకల కాకుండా ..
ప్రస్తుత Covid19 దృష్టిలో పెట్టుకొని,LOCKDOWNని గౌరవిస్తూ,విశిష్ట సేవలందిస్తున్న CovidHeros కి సెల్యూట్ చేస్తూ బాలయ్య అభిమానులు, మిత్రులు, ఆత్మీయులు వారి వారి ఇళ్లలో , కుటుంబసభ్యులతో కలిసి జూన్10న ఉదయం10: గం.10 ని:లకు విశ్వవ్యాప్తంగా ఒకేసమయంలో NBK60కేక్ కట్ చేసి సామాజిక బాధ్యతతో జన్మదిన వేడుకలు జరిపారు.. ఇలా జరపడం ఇదే మొదటిసారి కావడంతో

WONDER BOOK OF RECORDS మరియు GENIUS BOOK OF RECORDS వారు పర్యవేక్షించి ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డక బాలకృష్ణ గారికి ప్రశంసపత్రం అందజేస్తామని తెలిపారు.

అలాగే ప్రపంచ వ్యాప్తంగా 21000వేలమందికి పైగా వారి ఇళ్లలో ఒకేసమయం లో కేక్ కట్ చేసి రికార్డుని సాధించామని, ఆరోజు దాదాపు ప్రత్యేకంగా పరోక్షంగా worldwideగా 80వేలమంది కి పైగా వేడుకల్లో పాల్గొన్నారని NBK HELPING HANDS అధినేత అనంతరం జగన్ తెలుపుతూ... అలాగే మా కుటుంబ సభ్యుడుగా భావించే మా బాలయ్య గారి 60వ పుట్టినరోజు వేడుకలు.. కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో జరుపుకోవడం ప్రతి అభిమానికి ఎన్నటికీ మర్చిపోలేని తియ్యటి జ్ఞాపకం మని, బాలయ్యా గారి మంచి మనస్సుకు, సేవగుణనికి గుర్తుగా ప్రతి ఒక్కరూ పండుగలా జరిపామని,

కరోనా అందరిని ఇంట్లో నుండి బయటకు రాకుండా చేసింది కానీ మా గుండెల్లో ఉండే అభిమానాన్ని అపలేకపోయిందని తెలిపారు.

నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ నా 60వ పుట్టినరోజుని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నా అభిమానులతో పాటు, మిత్రులు,శ్రేయోభిలాషులు క్రమశిక్షణతో మీ కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరిపి మీ సామాజిక బాధ్యత ను నాకు అపూర్వకానుకగా ఇచ్చారు, మీ ప్రేమాభిమానాన్ని ప్రపంచ రికార్డు రూపంలో అందించిన మీ అందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,సామాజిక దూరం పాటించి సేవకార్యక్రమలు చేసిన వారందరికి,ఆర్గనైజింగ్ చేసిన అనంతపురం జగన్ కి అభినందనలు తెలిపారు.

 

 

 

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved