pizza
FCUK pre release on 6 Feb
ఫిబ్ర‌వ‌రి 6న 'ఎఫీసీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)' బార‌సాల వేడుక‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

03 February -2021
Hyderabad




Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.

Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad


జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)' చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించారు.

కాగా, ఈ నెల 6న, శ‌నివారం ఈ సినిమా బార‌సాల వేడుక జ‌ర‌గ‌నున్న‌ది. ఈ విష‌యం తెలియ‌జేస్తూ, "ఎఫ్‌సీయూకే బార‌సాల వేడుక ఫిబ్ర‌వ‌రి 6న" అంటూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి బార‌సాల వేడుక ఏమిటి!.. అంటూ అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం, కుతూహ‌లం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ త‌ర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టిన‌ట్లు అర్థం చేసుకొన్నారు. ఆ రోజు ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కులు చూడ‌నున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌, వారి క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. వీట‌న్నింటికీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించిన తీరు అంద‌రిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించి, సినిమాపై అంచ‌నాల‌ను అనూహ్యంగా పెంచేసింది.

రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాద‌ర్‌గా టైటిల్ రోల్ చేసిన జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌లోని రొమాంటిక్ యాంగిల్‌, ఆ యాంగిల్‌ను ఆయ‌న పండించిన తీరు ప్రేక్ష‌కుల్ని అమితంగా అల‌రించ‌నున్నాయి. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయ‌న చాలా కాలం త‌ర్వాత ఈ త‌ర‌హా పాత్ర‌ను పోషించ‌డం గ‌మ‌నార్హం.

భీమ్స్ సెసిరోలియో సుమ‌ధుర సంగీత బాణీలు అందించిన పాట‌లు ఇటీవ‌ల వ‌రుస‌గా వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్‌, మీడియా సిబ్బంది లాంటి కొవిడ్ హీరోల చేతుల మీదుగా విడుద‌లై సంగీత ప్రియుల ఆద‌రాభిమానాల‌ను పొందుతున్నాయి.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

 

 


 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved