pizza
Aatadukundam Raa first look
You are at idlebrain.com > news today >
Follow Us

06 November 2015
Hyderabad

 

సుశాంత్‌, జి.నాగేశ్వరరెడ్డిల 'ఆటాడుకుందాం..రా' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన అక్కినేని అఖిల్‌

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). అఖిల్‌ బాలనటుడిగా నటించిన 'సిసింద్రీ' చిత్రంలోని 'ఆటాడుకుందాం.. రా..' అనే పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అదే టైటిల్‌తో సుశాంత్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను అఖిల్‌ అక్కినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో సుశాంత్‌ మాట్లాడుతూ - ''ఇప్పటివరకు నేను చేసిన కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాల కంటే పూర్తి డిఫరెంట్‌గా వుండే సబ్జెక్ట్‌ ఇది. నాగేశ్వరరెడ్డిగారు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఆటాడుకుందాం.. రా' నా కెరీర్‌లో డెఫినెట్‌గా మంచి కమర్షియల్‌ హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల మాట్లాడుతూ - ''అక్కినేని అఖిల్‌ చేతుల మీదుగా రిలీజ్‌ అయిన మా 'ఆటాడుకుందాం..రా' చిత్రం ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సుశాంత్‌ గెటప్‌ చాలా బాగుందని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. సినిమా చాలా బాగా వస్తోంది. నాగేశ్వరరెడ్డి మార్క్‌ కామెడీతోపాటు యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆటాడుకుందాం..రా' సుశాంత్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

సుశాంత్‌, సోనమ్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాస్‌, సుధ, ఝాన్సీ, ఆనంద్‌, రమాప్రభ, రజిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved