pizza
Nithin 25 th film Chal Mohan Ranga First Look
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన 'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చిత్రం ఫస్ట్ లుక్ 'చల్ మోహన్ రంగ'
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2018
Hyderabad

'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ 'చల్ మోహన్ రంగ' ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్ఫయి నిమిషాలకు విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. నా అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం ప్రచార చిత్రాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు హీరో నితిన్.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఏంటో సంతోషంగాఉంది. ఆయనకు మా తరపున చిత్రం యూనిట్ తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు అన్నారు. చిత్రం టీజర్ ను ప్రేమికులరోజు అయిన ఈ నెల 14న, చిత్రం ను ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన ఒక్క గీతాన్ని ఈ నెల

14 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించనున్నామని తెలిపారు. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..' ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. నా ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఆనందంగా ఉందని, కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ;

సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి
నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved