pizza
Mr. Majnu first look
Youth King Akhil Akkineni, Venky Atluri's Biggie Produced by BVSN Prasad Is Titled As 'Mr Majnu'
యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం పేరు 'Mr. మజ్ను'
You are at idlebrain.com > news today >
Follow Us

19 September 2018
Hyderabad

Youth King Akhil Akkineni's next Produced by Big Films Producer BVSN Prasad under Sri Venkateswara Cine Chitra LLP Directed by 'Tholiprema' fame Venky Atluri is a Youthful Love Entertainer. This film has been titled as 'Mr Majnu'. Akhil's Grandfather Dr Akkineni Nageswara Rao did 'Laila Majnu' and Father King Nagarjuna did 'Majnu' in the past. Now for the third time Akkineni's 3rd generation Hero Akhil is getting ready to repeat the magic as 'Mr Majnu'. First Look Teaser of the film is released on the occasion of Akkineni Nageswara Rao Gari Jayanthi. Akhil makes a stylish entry in the teaser while playing a foot tapping background song with lyrics ' Devadasu Manavado...Manmadhudiki Varasudo...Kaavyamlo Kaamudo...Anthakannaa Rasikudo..' followed by a dialogue uttered by Akhil Akkineni "Excuse me miss..emitoo English bhaasha. Dennite miss cheyakudado daanne 'miss' annaru" which connects well with youth audience. Akhil is all set to weave his charm with his Stylish Looks and Performance as 'Mr Majnu'. Shoot is going on a brisk pace. Makers are planning to release the film in December. Nidhi Agerwal is pairing with Akhil Akkineni in this film.

Principle cast involves Nagababu, Priyadarshini, Jayaprakash, Hyper Aadi.
Music : Than
Lyrics : Sree Mani
Cinematography : George C Williams
Editing : Naveen Nooli
Art : Avinash Jolla
Choreography : Sekhar
Produced by : BVSN Prasad
Story, Screenplay, Direction : Venky Atluri

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం పేరు 'Mr. మజ్ను'

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'Mr. మజ్ను' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అఖిల్‌ తాతగారు డా.అక్కినేని నాగేశ్వరరావు 'లైలా మజ్ను'గా, తండ్రి కింగ్‌ నాగార్జున 'మజ్ను'గా నటించారు. ఇప్పుడు అఖిల్‌ అక్కినేని 'Mr. మజ్ను'గా అందర్నీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను నటసామ్రాట్‌ డా. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌లో యూత్‌ కింగ్‌ అఖిల్‌ అక్కినేని స్టైలిష్‌ లుక్‌తో ఎంట్రీ ఇవ్వగా, 'దేవదాసు మనవడో.. మన్మథుడికి వారసుడో, కావ్యంలో కాముడో.. అంతకన్నా రసికుడో..' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే టైటిల్‌ సాంగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. 'ఎక్స్‌క్యూజ్‌మి మిస్‌.. ఏమిటో ఇంగ్లీష్‌ భాష, దేన్నయితే మిస్‌ చేయకూడదో దాన్నే మిస్‌ అన్నారు' అంటూ అఖిల్‌ అక్కినేని చెప్పే డైలాగ్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది. ఈ చిత్రంలో అఖిల్‌ అక్కినేని లుక్‌, స్టైల్‌, పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌,

నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved