pizza
Ram NRI first look
పవర్ ఆఫ్ రిలేషన్ షిప్స్ తో 'రామ్ ఎన్నారై'
You are at idlebrain.com > news today >
Follow Us

25 March 2016
Hyderaba
d

 

అలీ రేజా, సీతానారాయణన్ హీరో, హీరోయిన్లుగా సీనియర్ తారలు విజయ్ చందర్, గీతాంజలి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం 'రామ్ ఎన్నారై'. ఎన్. లక్మీనందా దర్శకత్వంలో మువ్వా సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 'పవర్ ఆఫ్ రిలేషన్ షిప్స్' అనేది ఉపశీర్షిక.

ఈ చిత్రవిశేషాలను నిర్మాత మువ్వా సత్యనారాయణ తెలియజేస్తూ - '' మానవ సంబంధాల నేపథ్యంలో సాగే చిత్రం ఇది. కథా కథనాలు ప్రధాన బలంగా నిలుస్తాయి. శ్రవణ్ అందించిన పాటలు మరో హైలైట్. పాలకొల్లు, చించినాడ, పెనుమర్రు, కవిటం, లక్కవరం, పేరుపాలెం, హైదరాబాద్, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. కథ విషయానికొస్తే.. రామ్ ఓ ఎన్నారై కుర్రాడు. ఇండియాలో ఉన్న తాతను కలవడం కోసం న్యూయార్క్ నుంచి కోనసీమకు వస్తాడు. ఆ ఊళ్లో తన తండ్రికి ఉన్న పేరు, ప్రఖ్యాతులు చూసి ఆశ్చర్యపోతాడు. అయితే.. ఆ పేరు, ప్రఖ్యాతులు రావడానికి కారణమైన వ్యక్తి గురించి తెలుసుకుని, తండ్రిని ఇండియా రప్పించాలనుకుంటాడు. తల్లిదండ్రులను ఇండియా రప్పించడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఓ అమ్మాయితో లవ్ లో పడతాడు. అయితే, ఆ అమ్మాయి నిరాకరిస్తుంది. మరి.. రామ్ తన తల్లిదండ్రులను ఇండియా రప్పించగలుగుతాడా? తండ్రికి కనువిప్పు చేయగలుగుతాడా? అమ్మాయి ప్రేమను గెల్చుకోగలుగుతాడా? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.

సూర్య, రఘు, జోగినాయుడు, వేణుగోపాల్, రవివర్మ, సన, మువ్యా సత్యనారాయణ, జయవాణి, రమేశ్, కృష్ణచందు, శ్రీమణి, మైనా, రవికుమార్, బాలాజీ, వెంకట చలపతి, సునీల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వీరబాబు బాసిన, సంగీతం: శ్రవణ్, కెమెరా: నాగబాబు, స్టిల్స్: బంగారం బ్రదర్స్, కాస్ట్యూమ్స్: ఎం. సుబ్బయ్య, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.లక్ష్మీనందా.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved