pizza
Yedu Chepala Katha First Look
"ఏడు చేపల కథ" ఫస్ట్ లుక్ విడుదల.... సూపర్బ్ రెస్పాన్స్
You are at idlebrain.com > news today >
Follow Us

21 October 2018
Hyderabad

"మీటూ" ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు "మీటూ" ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొంతమందికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు. "ఏడు చేపల కథ" చిత్రంలో టెమ్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. అడల్డ్ కామెడీ జోనర్ లో పూర్తిగా కొత్త వారితో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... ఆడవాళ్ల మీద మగవారు చేసిన అఘాయిత్యాలు... ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి ఘీ పెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరపున మీటూ అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను "ఏడు చేపల కథ" చిత్రంతో పరిచయం చేస్తున్నాం. అడల్డ్ కామెడీ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రాన్ని పూర్తిగా కొత్త వారితో నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకు ఈ తరహా ఫస్ట్ లుక్ పోస్టర్ రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని పోలిన విధంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. అభిషేక్ రెడ్డి కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. తన పెర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ టీజర్ ను విడుదల చేయబోతున్నాం. అని అన్నారు.

నటీనటులు
అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ - చరిత సినిమా ఆర్ట్స్
సమర్పణ - డా.రాకేష్ రెడ్డి
నిర్మాతలు - శేఖర్ రెడ్డి, జివిఎన్
సహ నిర్మాత - గుండ్ర లక్ష్మీ రెడ్డి,
సంగీతం - కవి శంకర్,
కెమెరా - ఆర్లీ,
పిఆర్ఓ - ఏలూరు శ్రీను,
రచన, దర్శకత్వం - శామ్ జే చైతన్య

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved