pizza
Ee Friday Favourite 7 to 4
ఈ ఫ్రైడే ఫేవరేట్ 7 టు 4
You are at idlebrain.com > news today >
Follow Us

31 March 2016
Hyderaba
d

ఇండస్ట్రీ మీద అభిమానం....సినిమా తీయాలన్న కోరిక...ఎలాగైనా థియేటర్లో తమ సినిమా చూసుకోవాలన్న తపన....ఇవన్నీ కొందరు యువకులను టాలీవుడ్ వైపు అడుగులు వేయించాయి. ఎలాంటి అండదండలు లేని వాళ్లకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు ఉంటాయో అందిరికీ తెలుసు. ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే....మరోవైపు సినిమాను చిత్రీకరించారు. పగలు జాబ్స్..రాత్రి షూటింగ్స్...వెరసి ....సక్సెస్ ఫుల్ గా ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అదే 7 టు 4. కమర్షియల్ అంశాలు జోడిస్తూనే....ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూను సినిమాలో చూపించబోతున్నారు. ఈ శుక్రవారం ఏప్రిల్ 1న 7 టు 4 విడుదలకు సిద్ధమవుతోంది. డజను సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటికి నిలిచినా....దాదాపు అన్ని మల్టీ ఫ్లెక్సులు సహా 70 థియేటర్లలో ప్రదర్శనకు రెడీ అవుతోంది. దర్శకుడు విజయ్ శేఖర్ సంక్రాంతి మాట్లాడుతూ...."మహిళలపై జరుగుతున్న అరాచకాలను నలుగురు యువకులు ఎలా ఎదిరించారన్నదే స్టోరీ పాయింట్. ఐతే దీని చూట్టూ...ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేను అల్లి...ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా తెరకెక్కించాం. సినిమా మేకర్స్, యాక్టర్స్ , టెక్నీషియన్స్ అంతా యువకులే. వీళ్లంతా ఇండస్ట్రీలో ఎన్నో ఆశలతో అడుగు పెడుతున్నారు. ఆనంద్ బట్చూ, రాజ్ బాలా, లౌక్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహిళా సమస్యలపై సినిమాకు ఓ మహిళ సంగీత దర్శకురాలు పనిచేస్తుండటం విశేషం. ఓ మంచి సినిమా చేయాలన్న మా ప్రయత్నానికి తోడ్పడాలని మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం"

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved