pizza
‘Friends In Law’ - First English-Telugu language crossover film
తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా ఫ్రెండ్స్ ఇన్ లా
You are at idlebrain.com > news today >
Follow Us

6 April 2018
Hyderabad

Friends in Law, a thought-provoking story about an orthodox Indian mother going on a journey of self realisation after spending 10 days with her gay son’s partner is a first of it’s kind Indian film about the acceptance of homosexuality. Producers of the film are hoping to open an important debate on gay rights in India with an engaging story told predominantly in English.

This is the first feature of Hyderabad based company HRH Film Productions, which is aiming to use the power of cinema to entertain and make a positive change. Celebrity photographer turned filmmaker Amit Khanna directs the English/Telugu language crossover film, which sees Shreedevi Chowdary make her big screen debut. Amit Khanna and Shreedevi Chowdary have co-produced the film with businesswoman Swati Sanghi, who hails from the famous Sanghi industrialist family. They have assembled a top team of technicians who have worked on high profile films across India and with the biggest names in cinema for their maiden project. “Friends In Law is a engaging story of a very relatable, orthodox Indian woman who lands up in Bangkok and unexpectedly spend 10 days with her gay son's partner. What follows is her enlightening journey towards self-realisation. The theme of acceptance is one that we feel will resonate universally, but it is also an uplifting movie that will make you smile,” explained Swati.

Friends In Law will travel to other high profile film festivals around the world before getting a global release. Producers are confident audiences will be entertained and think about the film long after it has ended.
Director and co-producer Amit Khanna hopes the team can use the power of cinema to make a positive difference. “The best films are ones that remain with you after they have ended and we feel confident Friends In Law falls into that category. With the film we hope to convey an important message of acceptance that can be applied to all areas of society,” said Amit.

Unlike other Indian films where gay people are portrayed as victims or outcasts, Friends In Law presents the gay male protagonist in a positive way. British actor Ashlin Harris plays the gay son's partner.

The film has music by Advait Nemlekar and cinematography by Ajayen Vincent.

Anuya Chauhan Kudecha and Ritesh Kudecha are associate producers on the movie.

తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా 'ఫ్రెండ్స్ ఇన్ లా'

ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అమిత్ ఖన్నా దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్స్ ఇన్ లా' తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా మన ముందుకు రాబోతుంది. మన సమాజంలో సంకుచిత విషయంగా పరిగణించే స్వలింగ సంపర్కాన్ని ప్రథాన కథాంశంగా తీసుకొని తెరకెక్కించబడిన ఈ చిత్రాన్ని అమిత్ ఖన్నా, శ్రీదేవి చౌదరి మరియు స్వాతి సాంఘి (సాంఘి ఇండస్ట్రీస్ కుటుంబ సభ్యురాలు) నిర్మించారు.

ఆచారాలు, పట్టింపులు కలిగిన ఓ మహిళ స్వలింగ సంపర్కుడైన తన కొడుకు యొక్క జీవిత భాగస్వామితో కొన్ని రోజుల సావాసం తర్వాత ఆమె పరివర్తన ఎలా చెందుతుంది అనేదే 'ఫ్రెండ్స్ ఇన్ లా' కథ. సమాజంలో వివక్షకు గురి కాబడుతున్న స్వలింగ సంపర్కుల గురించి ఆరోగ్యకర చర్చ లేవెనెత్తె ఉద్దేశంతోనే చిత్రాన్ని నిర్మించినట్లు, వారి హక్కుల పై అవగాహన కల్పించి ఆలోచన రేకెత్తించే విధంగా 'ఫ్రెండ్స్ ఇన్ లా' ఉంటుందని నిర్మాతలు తెలిపారు.

ఎక్కువ శాతం ఇంగ్లీష్ లో మాటలుండే ఈ చిత్రాన్ని హైదరాబాద్ కు చెందిన హెచ్.ఆర్.హెచ్ బ్యానర్ పై నిర్మించారు. అనుయా చౌహన్ కుదేచ మరియు రితేష్ కుదేచ సహాయ నిర్మాతలుగా వ్యవహరించారు.
నిపుణులైన సాంకేతిక వర్గం పని చేసిన ఈ చిత్రానికి అద్వైత నెంలేకర్ సంగీతం సమకూర్చగా అజేయన్ ఛాయగాహకునిగా వ్యవహరించారు. 'ఫ్రెండ్స్ ఇన్ లా' ఓ విభిన్న కథాంశంమే అయినా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించబడిందని చెప్పుకొచ్చారు స్వాతి. ఓ మంచి సందేశాన్నిచ్చే చిత్రం తీశామని సంతృప్తిగా ఉందని దర్శకుడు అమిత్ అన్నారు. చిత్రంలో శ్రీదేవి చౌదరి మరియు బ్రిటిష్ నటుడు ఆష్లీన్ హ్యారిస్ ముఖ్య పాత్రలు పోషించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved