pizza
Shakeela a part of Gang of Gabbar Singh
You are at idlebrain.com > news today >
Follow Us

17 May 2014
Hyderabad

గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి పాటలో పాల్గొని గుర్తింపు పొంది "గబ్బర్ సింగ్ గ్యాంగ్ '' ప్రధాన పాత్ర దారులుగా తార నీలు కార్పోరేషన్ పతాకంపై యం.యస్.బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం పేరు "గబ్బర్ సింగ్ గ్యాంగ్'' ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత యం.యస్.బాబు మాట్లాడుతూ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో షకీల ఫైనాన్స్ పెంటమ్మ అనే పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది అన్నారు.

షకీల మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర సీరియస్ గా ఉన్నప్పటికీ హాస్యం పండిస్తుంది. సమాజంలో రౌడీలుగా చలామణి అవుతున్న వ్యక్తులకు బాధ్యత గల చట్టాన్ని వారికి అప్పగిస్తే వారు పడే అగచాట్లు ఎలా ఉంటాయి అనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నేను ఫైనాన్స్ పెంటమ్మ అనే పాత్ర చేస్తున్నాను అన్నారు.

కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సినిమా ను త్వరిత గతిన పూర్తి చేసి వెనువెంటనే విడుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్.కె.మక్బూల్ .

బంటి,రమేష్,ఆంజనేయులు,ర్యామ్ సన్, సాయిబాబు, ప్రవీణ్, అలీ,గౌతంరాజు, చిట్టిబాబు తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: యం.యస్.బాబు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved