pizza
G Ashok about Bhaagamathie
`భాగమతి` యూనివర్సల్ సబ్జెక్ట్ - దర్శకుడు జి.అశోక్
You are at idlebrain.com > news today >
Follow Us

24 January 2018
Hyderabad

అనుష్క ప్రధాన పాత్రలో యు.వి. క్రియేుషన్స్ పతాకంపై జి.అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భాగమ‌తి’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు జి.అశోక్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘‘2012లో ఈ కథను మొదట యు.వి. క్రియేుషన్స్ వంశీ, ప్రమోద్‌గార్లకు వినిపించాను. కథ విని వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత హీరో ప్రభాస్‌గారికి కూడా చెప్పాను. ఆయన కూడా కథ చాలా బాగుంది అన్నారు. వారి సహకారంతో ఫైనల్‌గా అనుష్కగారికి కథ వినిపించాను. అలా ఓ భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే బాహుబలి చిత్రం మొదటి భాగం షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈ కథను అనుష్కగారికి వినిపించడం వినిపించాను. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అప్పటికే బాహుబలి కమిట్ అయి ఉండడం వల్ల ఆ రెండు భాగాలూ పూర్తయ్యేవరకు ఆగాల్సి వచ్చింది. మధ్యలో వచ్చిన గ్యాప్‌లో సినిమా స్టార్ట్ చేసేద్దామని ప్రయత్నించాం. కానీ, కుదరలేదు. ‘భాగమ‌తి’ విషయానికి వస్తే ఇది అందరికీ నచ్చే యూనివర్సల్ సబ్జెక్ట్. ఒక ప్రాంతానికి, ఒక భాషకు సంబంధించిన కథ కాదు. ఈ కథకు ఎలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకున్నా ఆకట్టుకుంటుంది. ఏ భాష వారికైనా ఈ కథ, ఇందులోని ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే అన్నిచోట్లా జరిగే కథే ఇది. ఇందులో భాగమతి క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ తరహా క్యారెక్టర్ చెయ్యాలంటే ఆ ఆర్టిస్టుకి ఓ స్టేచర్ ఉండాలి. భాగమతి అంటే ఇలాగే ఉంటుందేమో అని ప్రేక్షకులకు అనిపించాలి. అన్నింటినీ మించి ఆ ఆర్టిస్టుకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండాలి. ఈ లక్షణాలన్నీ అనుష్కలో మాత్రమే మనకు కనిపిస్తాయి. భాగమతి క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చెయ్యగల నటి అనుష్క అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆమె కోసం సినిమాను మొదలు పెట్టకుండా సంవత్సరాల తరబడి వెయిట్ చేశాను. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత భాగమతి క్యారెక్టర్‌లో అనుష్కని చూసి మా సెలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అర్థైమెంది. ప్రతి ఎమోషన్‌ని ఎంతో అద్భుతంగా క్యారీ చేశారు. డైలాగ్స్ కూడా ఒక రేంజ్‌లో చెప్పారు. ఈ క్యారెక్టర్ కోసం అనుష్క పడిన కష్టం మామూలుది కాదు. తన చేతికి గాయమై బాధ పెడుతున్నా లెక్క చేయుకుండా పనిచేశారు. పురాతనమైన బంగ్లా కావడం వల్ల డస్ట్ కూడా క్రియేట్ చెయ్యాల్సి వచ్చింది. ఆమెకు డస్ట్ ఎలర్జీ ఉన్నా దాన్ని లెక్క చెయ్యకుండా హండ్రెడ్ పర్సెంట్ ఔట్ పుట్ వచ్చేవరకు పెర్‌ఫార్మ్ చేసేవారు. అసలు అనుష్కగారు ఈ సినిమా చెయ్యకపోతే ‘భాగమ‌తి’ అనే ప్రాజెక్టే ఉండేది కాదు.

interview gallery



ఇంతకుముందు అనుష్కగారు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలా చేశారు. వాటికి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం కనిపించదు. పాత్ర పరంగా కూడా చాలా కొత్తగా ఉంటుంది. నిజానికి ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఉండే సినిమా ఇది. ఈ సినిమాకి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ అదే అని చెప్పాలి. ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌తో పాటు మరో ముఖ్యైమెన క్యారెక్టర్ ఉంది. అదే కథలో కీలకైమెన బంగ్లా. దాని చుట్టూ ‘భాగమ‌తి’ కథ తిరుగుతుంది. సబ్జెక్ట్ డిమాండ్ మేరకు భారీ సెట్ వెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. మొదట అలాంటి బంగ్లా ఎక్కైడెనా దొరుకుతుందేమోనని చాలా లొకేషన్స్‌లో చూడడం జరిగింది. అయితే మా ఊహలకు తగ్గ బంగ్లా ఎక్కడా కనిపించలేదు. దీంతో భారీ సెట్ వెయ్యాల్సి వచ్చింది. కథను, నన్ను నమ్మిన నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఎంతో భారీ సెట్‌ని నిర్మించడానికి సిద్ధవుయ్యారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌గారు చాలా అద్భుతంగా ఈ సెట్‌ని డిజైన్ చేశారు. నిజంగా ఆ బంగ్లా 400 సంవత్సరాల క్రితం నిర్మించిందేనా అనిపించేలా ఉంది. ‘భాగమ‌తి’ 75 శాతం సినిమా ఆ బంగ్లాలోనే జరుగుతుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా ‘భాగవుతి’ ప్రేక్షకులంతా ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా కెరీర్‌లో ఈ సినిమా ఓ మెవురబుల్ మూవీ అవుతుందని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పగలను’’ అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved