pizza
Geetha Madhuri in Metro song
మెట్రో మూవీ సాంగ్ లో న‌టించిన గీతామాధురి
You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2016
Hyderaba
d

We recently reported that Popular Singer Geetha Madhuri is making her debut in a film. The details about the film were kept under wrap. Now, the exciting details about her launch are out.

Geetha Madhuri is making her debut with upcoming film 'Metro'. We read so many article about chain-snatching every day, but this is the first film to go through this concept. It is one of the finest film in recent time and it will surely entertain every Telugu audience.

Geetha Madhuri is very popular singer in Telugu and she is in demand. She not only sung a Melody number in this film but also portrayed herself in this song.

On this rear occasion, Producer Rajini Talluri said "Our film 'Metro' will hit the screens soon. The melody song sung by Geetha Madhuri will be big asset for our film. This talented singer also performed well in this song. We are releasing the first look stills of Geetha Madhuri".

Movie presenter Suresh Kondeti said "Popular singer Geetha Madhuri's song will be very special in this film. The song will be melodies and visual treat. This film will be sure shot hit. The dubbing of this film is done and first copy will be ready soon".

The 'Metro' movie is being produced by Rajini Talluri under A4 Entertainments banner.

మెట్రో మూవీ సాంగ్ లో న‌టించిన గీతామాధురి

టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం గీతామాధురి న‌టించిన సినిమా డీటెయిల్స్ వ‌చ్చేశాయి. డైన‌మిక్ సింగ‌ర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.

గీతామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్‌ సినిమా `మెట్రో`. ఇటీవ‌లే స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెర‌కెక్కిన చిత్రంగా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలాంటి క్రేజీ మూవీ `మెట్రో`లో ఓ సాంగ్‌లో గీతామాధురి త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాట‌ను తాను స్వ‌యంగా ఆల‌పించడ‌మే గాకుండా త‌న‌దైన శైలిలో అభిన‌యించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ -`` అతి త్వ‌ర‌లోనే `మెట్రో` తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆల‌పించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్‌. ఈ ట్యాలెంటెడ్ సింగ‌ర్ స్వ‌యంగా పాడ‌ట‌మే గాకుండా అభిన‌యించారు. ఈ సినిమాలో అన్ని పాట‌లు సంద‌ర్భానుసారం వ‌స్తూ వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయి. ఈ రోజు గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -``వ‌ర్ధ‌మాన గాయ‌ని గీతామాధురి ఆల‌పించి నటించిన‌ ఈ గీతం సినిమాలో వెరీ స్పెష‌ల్‌. మేకింగ్ ప‌రంగా విజువ‌లైజేష‌న్ ప‌రంగా వండ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. క్రియేటివ్ మేకింగ్ క‌నిపిస్తుంది. ఈ సీజ‌న్‌లో పెద్ద హిట్ట‌య్యే చిత్ర‌మిది. ఇటీవ‌లే డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైన‌ల్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.

ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ఏ4 ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ర‌జ‌నీ తాళ్లూరి నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved