pizza
George Reddy team helps during shutdown
సినీ కార్మికులకు జార్జిరెడ్డి టీం సాయం
You are at idlebrain.com > news today >
Follow Us

05 April 2020
Hyderabad



కరోనా మహమ్మారిని తరిమికొట్టే నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ అనివార్యం అయింది. దీంతో పేద ప్రజల కష్టాలు ఎక్కువ అయ్యాయి. వలస కార్మికులు, రోజూవారి కూలీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పనులు లేక వారు ఇళ్లకే పరిమితం అవడంతో పొట్ట గడవని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వారిని ఆదుకోవడానికి కొందరు పెద్దమనసుతో ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు రద్దు కాగా చేతిలో పనులు లేక పేద సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ఇప్పటికే సినీ పెద్దలు విరాళాలు అందించారు. అయితే ఆ సహాయం కార్డుదారులకే లభించింది. కార్డులు లేని కార్మికులు కూడా ఉన్నారు. వారిని ఆదుకునేవారు కరువయ్యారు.

అలాంటివారిని ఆదుకోవడానికి మేము సైతం అన్నారు ‘జార్జిరెడ్డి’ సినిమా టీం. కార్డులేని వంద మంది సినీ కార్మికులకు వారు ఇవాళ, నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు అందించారు. పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామురెడ్డి, దర్శకుడు జీవన్ రెడ్డి సహా చిత్ర కథానాయకుడు సందీప్ (సాండీ), తిరువీర్, మణికంఠ, జనార్ధన్, సంపత్, సురేష్, సుబ్బరాజు,లక్ష్మణ్ తదితరులు హాజరై కార్మికులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో అవసరం. భౌతిక దూరాన్ని పాటిస్తూ సామాజిక స్పృహతో సహాయం చేయడం మన కర్తవ్యంగా భావించాలి’ అని అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved