pizza
Gopichand - AS Ravi Kumar film release on 25 December
You are at idlebrain.com > news today >
Follow Us

22 August 2015
Hyderabad


షూటింగ్ జరుపుకుంటున్న భవ్య క్రియేషన్స్ చిత్రం

గోపిచంద్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో 'యజ్ఞం' ఒకటి. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 'యజ్ఞం' విడుదలై, దాదాపు పదకొండేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ హీరోగా రవికుమార్ చౌదరి ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా నిరవధికంగా జరుగుతోంది.

చిత్రవిశేషాలను రవికుమార్ చౌదరి చెబుతూ - ''గోపీచంద్ తో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా కాంబినేషన్లో వచ్చిన 'యజ్ఞం'కి, దీనికీ సంబంధం లేదు. ఈ చిత్రకథ వినూత్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నా సినిమాల్లో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అది మిస్ కాదు. అలాగే, యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పటివరకూ గోపీచంద్ కెరీర్లో భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ఇదే కావడం విశేషం. కథ డిమాండ్ మేరకు చాలా పాత్రలుంటాయి. అయితే, అన్ని పాత్రలకూ తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఒక సూపర్ హిట్ మూవీకి కావల్సిన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

""'యజ్ఞం'తో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, రవికుమార్ చౌదరి కాంబినేషన్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. శరవేగంగా షూటింగ్ చేస్తున్నాం'' అని ఆనంద్ ప్రసాద్ చెప్పారు.

గోపీచంద్ సరసన రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షావుకారు జానకి, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పథ్వీ, అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, నాజర్, ముఖేష్ రుషి, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే: కోన వెంకట్, రచన: ఘటికాచలం, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved